‘సాయిరాం పార్లర్’ యజమాని సత్యనారాయణ హఠాన్మరణం
ABN , Publish Date - Sep 12 , 2024 | 01:18 AM
ప్రముఖ హోటల్ వ్యాపారి తాళ్లూరి సత్యనారాయణ (59) (సాయిరాం పార్లర్ సత్యనారాయణ) అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు.
అక్కయ్యపాలెం, సెప్టెంబరు 11:
ప్రముఖ హోటల్ వ్యాపారి తాళ్లూరి సత్యనారాయణ (59) (సాయిరాం పార్లర్ సత్యనారాయణ) అనారోగ్యంతో మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. మూడు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సత్యనారాయణ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి నగరంలోని హోటల్ పరిశ్రమకు తీరని లోటని, ఆప్తుడ్ని కోల్పోయామని అసోసియేషన్ ప్రతినిధులు విచారం వ్యక్తంచేశారు. బుధవారం మధ్యాహ్నం సత్యనారాయణ అంత్యక్రియలు పూర్తి చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.