Share News

మూడేళ్ల సర్క్యులర్‌ను రద్దు చేయాలి

ABN , Publish Date - Nov 21 , 2024 | 01:18 AM

మూడేళ్ల సర్క్యులర్‌ను రద్దు చేయాలి

మూడేళ్ల సర్క్యులర్‌ను రద్దు చేయాలి
కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న వీఓఏలు

వీఓఏలు డిమాండ్‌.. కలెక్టరేట్‌ వద్ద ధర్నా

అనకాపల్లి కలెక్టరేట్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ) పరిధిలోని వెలుగులో పనిచేస్తున్న వీఓఏల మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్‌ను రద్దు చేయాలని, నాలుగు నెలల బకాయి వేతనాలు చెల్లించాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షురాలు రూపాదేవి డిమాండ్‌ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వీఓఏలు బుధవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం వీఓఏలకు మూడు సంవత్సరాల కాల పరిమితి సర్క్యులర్‌ తీసుకువచ్చిందని, దీనివల్ల 15 సంవత్సరాలకుపైగా పనిచేస్తున్న వీఓఏల కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీఓఏల ఆందోళనలతో గత ప్రభుత్వానికి ఈ సర్క్యులర్‌ను తాత్కాలికంగా నిలుపుదల చేసిందని చెప్పారు. ఇటీవల రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.. ఈ సర్క్యులర్‌ ఆధారంగా మూడు సంవత్సరాలు పూర్తయిన వీఓఏలను మార్చుకోవచ్చనని ప్రకటన చేశారన్నారు. గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సర్క్యులర్‌ను రద్దు చేసి వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో వీఓఏల సంఘం జిల్లా అధ్యక్షుడు సూరిబాబు, కోశాధికారి లక్ష్మీప్రసన్న, సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు వీవీ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 21 , 2024 | 01:19 AM