Share News

చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు

ABN , Publish Date - Nov 22 , 2024 | 12:44 AM

జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21.3 లక్షల విలువ చేసే బంగారం, ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ తుహిన్‌ సిన్హా గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడిమాసమావేశంలో వెల్లడించారు.

చోరీ కేసుల్లో ముగ్గురి అరెస్టు
చోరీ సొత్తును పరిశీలిస్తున్న ఎస్పీ తుహిన్‌సిన్హా, అధికారులు

రూ.21.3 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం

అనకాపల్లి రూరల్‌, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల పరిధిలో జరిగిన పలు చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.21.3 లక్షల విలువ చేసే బంగారం, ద్విచక్ర వాహనాలు, మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ తుహిన్‌ సిన్హా గురువారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడిమాసమావేశంలో వెల్లడించారు.

188 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ తుహిన్‌ సిన్హా పేర్కొన్నారు. గురువారం పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తుహిన్‌సిన్హా ఆయా చోరీ కేసులకు సంబంధించి వివరాలను వెల్లడించారు. అచ్యుతాపురం, పరవాడ పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఐదు చోరీ కేసులకు సంబంధించి సుమారు రూ.10 లక్షలు విలువ గల 143 గ్రాముల బంగార ఆభరణాలను స్వాధీనం చేసుకుని ఒక నిందితుడిని అరెస్టు చేసినట్టు ఆయన తెలిపారు. అలాగే ఎలమంచిలి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన నాలుగు చోరీ కేసుల్లో సుమారు రూ.11.3 లక్షల విలువ గల 45 గ్రాముల బంగారం, నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక మొబైల్‌ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్టు చేశామన్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించామన్నారు. చోరీ సొత్తును రికవరీ చేయడంలో కీలకంగా వ్యవహరించిన సీసీఎస్‌ సిబ్బందిని ప్రశంసించారు. ఈ సమావేశంలో పరవాడ సీఐ మల్లికార్జునరావు, అచ్యుతాపురం సీఐ ఎన్‌.గణేశ్‌, సీసీఎస్‌ ఎస్‌ఐ పి.రమేశ్‌, సీసీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 22 , 2024 | 12:44 AM