Share News

గృహ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:29 PM

నిర్మాణాలు పూర్తి చేసుకున్న పక్కా గృహాల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని జిల్లా హౌసింగ్‌శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.బాబు తెలిపారు. బుధవారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆయన కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న గృహాలను స్వయంగా పరిశీలించారు.

గృహ లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు
గృహ లబ్ధిదారులతో మాట్లాడుతున్న హౌసింగ్‌ పీడీ బాబు

హౌసింగ్‌ పీడీ బాబు

చింతపల్లి, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నిర్మాణాలు పూర్తి చేసుకున్న పక్కా గృహాల లబ్ధిదారులకు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నామని జిల్లా హౌసింగ్‌శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.బాబు తెలిపారు. బుధవారం చింతపల్లి మండలంలో పర్యటించిన ఆయన కొమ్మంగి పంచాయతీ కొలపరి గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న గృహాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పీఎం జన్‌మన్‌ పథకంలో అత్యధిక సంఖ్యలో పక్కా గృహాలు మంజూరయ్యాయన్నారు. చింతపల్లి మండలంలో 2,674 మంది పీవీటీజీలకు పక్కా గృహాలు మంజూరయ్యాయన్నారు. 1,207 మంది లబ్ధిదారులు పునాదులు పూర్తి చేసుకున్నారన్నారు. 235 మంది రూఫ్‌ స్థాయి, 23 మంది శ్లాబ్‌ స్థాయి నిర్మాణాలు పూర్తి చేసుకున్నారని చెప్పారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న లబ్ధిదారులకు నగదు చెల్లించామన్నారు. కొంత మందికి సాంకేతిక సమస్య కారణంగా బిల్లులు విడుదల కాలేదని, ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే మార్చినాటికి పీఎం గ్రామీణ పథకం గృహాల నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. పక్కా గృహాలను సకాలంలో పూర్తి చేయించేందుకు ఏఈలు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు ప్రత్యేక కృషి చేస్తున్నారన్నారు. నిధుల కొరతలేదని, పక్కా గృహం నిర్మించుకున్న వారం రోజుల్లోనే లబ్ధిదారుని వ్యక్తిగత ఖాతాలో నిధులు జమ అవుతాయని తెలిపారు. ఆయన వెంట ఏఈ కె.రమణబాబు, వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజారావు వున్నారు.

Updated Date - Nov 13 , 2024 | 11:29 PM