జీసీసీ బలోపేతానికి సహకరించాలి
ABN , Publish Date - Dec 02 , 2024 | 11:30 PM
జీసీసీ బలోపేతానికి, అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌ను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ కోరారు.
కలెక్టర్‌ను కోరిన కిడారి శ్రావణ్‌కుమార్
పాడేరు, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): జీసీసీ బలోపేతానికి, అభివృద్ధికి సహకరించాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్‌ను జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్ కోరారు. కలెక్టర్‌ను సోమవారం సాయంత్రం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. తన చాంబర్‌లో శ్రావణ్‌కుమార్‌కు శాలువా కప్పి జ్ఞాపికను అందించి కలెక్టర్ సత్కరించారు. ఈ సందర్భంగా గిరిజన సహకార సంస్థ స్థితిగతులు, సమస్యలు, పరిష్కార మార్గాలపై చర్చించుకున్నారు. ఈ కార్యక్రమంలో జీసీసీ డైరెక్టర్ బొర్రా నాగరాజు, టీడీపీ నేతలు పాండురంగస్వామి, బాకూరు వెంకటరమణ, సాగర సుబ్బారావు, బుక్కా జగదీశ్, మురళి, అచ్చిబాబు పాల్గొన్నారు.