హైవేపై ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:45 AM
ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూటమి నాయకులతో పాటు, కార్యకర్తలు పలు వాహనాల్లో మంగళవారం ఉదయం నుంచే విజయవాడ బయలుదేరారు.
నక్కపల్లి, జూన్ 11: ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం ప్రమాణ స్వీకారం నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూటమి నాయకులతో పాటు, కార్యకర్తలు పలు వాహనాల్లో మంగళవారం ఉదయం నుంచే విజయవాడ బయలుదేరారు. సాయంత్రం వరకూ అనేక వాహనాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు తరలివెళుతున్నారు. దీనిని దృష్టిలో వుంచుకుని పోలీస్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. హైవేపై వాహనాల రద్దీ లేకుండా వేంపాడు టోల్‌ప్లాజా వద్ద సీఐ విజయ్‌కుమార్ నేతృత్వంలో పోలీసులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణ చర్యలు చేపట్టారు.