34 మంది ఎస్‌ఐల బదిలీ
ABN , Publish Date - Sep 21 , 2024 | 12:41 AM
జిల్లాలో 34 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఎం.దీపిక శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ దీపిక ఉత్తర్వులు జారీ
వీఆర్‌లో ఉన్న పలువురికి పోస్టింగు
కొత్తూరు, సెప్టెంబరు 20: జిల్లాలో 34 మంది ఎస్‌ఐలను బదిలీ చేస్తూ ఎస్పీ ఎం.దీపిక శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నాతవరం ఎస్‌ఐ ఎం.రామారావును పరవాడకు బదిలీ అయ్యారు. గొలగొండ ఎస్‌ఐ బి. రామకృష్ణారావు పరవాడకు, దేవరాపల్లి ఎస్‌ఐ డి.నాగేంద్ర రాంబిల్లికి, ఎలమంచిలి రూరల్ ఎస్‌ఐ పి. సింహాచలం సబ్బవరం పోలీసు స్టేషన్‌కు బదిలీ అయ్యారు. బుచ్చెయ్యపేట ఎస్‌ఐ డి.ఈశ్వరరావు అనకాపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌కు, డీఎస్‌బీ అనకాపల్లి ఎస్‌ఐ అల్లు వెంకటేశ్వరరావు అనకాపల్లి పట్టణ పోలీసుస్టేషన్‌కు, అనకాపల్లి పట్టణ ఎస్‌ఐగా ఉన్న ఎండీ ఆలీ షరీఫ్ అనకాపల్లి ఉమెన్ పీఎస్‌కు, వీఆర్‌లో ఉన్న ఎ.శ్రీనివాసరావు బుచ్చెయ్యపేట పీఎస్‌కు, బి.సురేష్‌బాబు, జి.ధనుంజయనాయుడులను డీఎస్‌బీ అనకాపల్లికి బదిలీ చేశారు. అచ్యుతాపురం ఎస్‌ఐ ఎం.నారాయణరావును అనకాపల్లి సీసీఎస్‌కు, నర్సీపట్నం టౌన్ పీఎస్ ఎస్‌ఐ కె.సుధాకర్ అచ్యుతాపురం పీఎస్‌కు, వీఆర్‌లో ఉన్న జె.రమేష్‌ను నర్సీపట్నం టౌన్ పీఎస్‌కు, సాకేటి ప్రసాద్‌ను అనకాపల్లి డీపీఆర్‌బీ, కె.సన్నిబాబును నక్కపల్లి పీఎస్‌కు, ఎస్.అప్పలకొండను పీసీఆర్ అనకాపల్లికి, ఎస్‌కె. మదీనావలీని పీసీఆర్ అనకాపల్లికి, ఎస్‌కే. రషీద్‌ను సీసీఎస్ అనకాపల్లికి, జె.నాగేశ్వరరావును సీసీఎస్ అనకాపల్లికి, జి.విశ్వనాథంను డీఎస్‌బీ అనకాపల్లికు, ఎన్.భాస్కరరావును బుచ్చెయ్యపేట పీఎస్‌కు, పి.కామేశ్వరరావును డీఎస్‌బీ అనకాపల్లికి, పి.ప్రసాదరావును పరవాడ పీఎస్‌కు, ఎం.సురేంద్రకుమార్‌ను ఎన్‌హెచ్ స్క్వాడ్ అనకాపల్లి, ఎం. వెంకట్రావును డీఎస్‌బీ అనకాపల్లి, పీవీ.వెంకటరమణను సీసీఎస్ నర్సీపట్నం, కె.సత్యనారాయణను సీసీఎస్ నర్సీపట్నం టౌన్‌కు బదిలీ అయ్యారు. అనకాపల్లి పీసీఆర్‌లో ఉన్న బి.అంజిబాబును డీఎస్‌బీ అనకాపల్లికి, చోడవరం ఎస్‌ఐ డి.శేఖరం అనకాపల్లి ట్రాఫిక్‌కు, వెయిటింగ్ పోస్టింగ్‌లో ఉన్న పి.మనోజ్‌కుమార్ కశింకోట పీఎస్‌కు, జి.సత్యనారాయణను అనకాపల్లి ట్రాఫిక్‌కు, యు.రాజారావును పీఆర్.పేటకు, డి.పణిదాస్‌ను అనకాపల్లి సీసీఎస్‌కు, కె.సంతోష్‌కుమార్‌ను అనకాపల్లి పట్టణ పోలీసు స్టేషన్‌కు బదిలీ చేసినట్టు ఎస్పీ దీపిక పేర్కొన్నారు.