ఆరోగ్య శాఖలో బదిలీలు
ABN , Publish Date - Dec 22 , 2024 | 12:56 AM
వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఇతర జిల్లాలకు వెళ్లగా, ఇతర జిల్లాలకు చెందిన అధికారులు జిల్లాకు వచ్చారు.
విజయనగరం డీఎంహెచ్‌ఓగా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ జీవనరాణి
రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (మేల్) ప్రిన్సిపాల్‌గా శ్రీకాకుళం జిల్లా డీఎంహెచ్‌వో బి.మీనాక్షి
అనకాపల్లి డీఎంహెచ్‌వోగా డాక్టర్ రవికుమార్
విశాఖపట్నం, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి):
వైద్య, ఆరోగ్య శాఖలో భారీగా బదిలీలు జరిగాయి. జిల్లాలో పనిచేస్తున్న పలువురు ఇతర జిల్లాలకు వెళ్లగా, ఇతర జిల్లాలకు చెందిన అధికారులు జిల్లాకు వచ్చారు. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణిగా పనిచేస్తున్న డాక్టర్ ఎస్.జీవనరాణి విజయనగరం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. శ్రీకాకుళం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణిగా పనిచేస్తున్న డాక్టర్ బి.మీనాక్షి నగర పరిధిలోని మేల్ రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఆర్‌టీసీ) ప్రిన్సిపాల్‌గా నియమితు లయ్యారు. అనకాపల్లి జిల్లా కె.కోటపాడు సీహెచ్‌సీలో పనిచేస్తున్న డాక్టర్ ఎస్.శ్రీనివాస్ నగరంలోని విక్టోరియా ఆస్పత్రి సీఎస్‌ఆర్ ఎంవోగా నియమితులయ్యారు. తిరుపతి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ యు.శ్రీహరి కేజీహెచ్‌లో కొన్నేళ్లుగా ఖాళీగా ఉన్న సీఎస్‌ఆర్‌వోగా నియమితు లయ్యారు.
అనకాపల్లి డీఎంహెచ్‌వోగా రవికుమార్
చిత్తూరు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా పనిచేస్తున్న డాక్టర్ ఓ.ప్రభావతి దేవి పాడేరు జిల్లా అడిషనల్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిణిగా నియమితు లయ్యారు. కాగా, విజయనగరం జిఆ్ల గజపతి నగరం ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న డాక్టర్ పి.రవికుమార్ అనకాపల్లి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారిగా నియమితులయ్యారు.