Share News

ఒకేసారి రెండు డిగ్రీలు

ABN , Publish Date - Sep 16 , 2024 | 01:15 AM

డిగ్రీ పట్టాతో బయటకు వస్తున్న వారికి ఆశించిన స్థాయి లో ఉద్యోగావకాశాలు లభించడం లేదు.

ఒకేసారి రెండు డిగ్రీలు

  • ఏయూలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీలో అమలుకు సన్నాహాలు

  • విద్యార్థికి ఆసక్తి ఉన్న రెండు కోర్సులు ఒకేసారి పూర్తిచేసి సర్టిఫికెట్లు పొందేందుకు అవకాశం

  • ఉద్యోగావకాశాలు మెరుగుపరచడమే ధ్యేయం

  • నూతన విద్యా విధానం- 2020లో భాగంగా ప్రారంభం

  • ఇప్పటికే ఇంజనీరింగ్‌ విభాగంలో మిగిలిన బ్రాంచీల విద్యార్థులకు మూడో ఏడాది సీఎస్‌ఈ చేసే వెసులుబాటు

(విశాఖపట్నం,ఆంధ్రజ్యోతి)

డిగ్రీ పట్టాతో బయటకు వస్తున్న వారికి ఆశించిన స్థాయి లో ఉద్యోగావకాశాలు లభించడం లేదు. దీనికి కారణం విద్యార్థుల్లో ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు లేకపోవడమేనని పరిశ్రమల నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానం-2020 పేరుతో సంస్కరణ లకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో ఒకేసారి విద్యార్థి రెండు డిగ్రీలు పొందే అవకాశాన్ని కల్పిస్తోంది. ఇప్పటికే జాతీయ వర్సిటీల్లో ఈ విధానాన్ని అమలుచేస్తుండగా, రాష్ట్ర యూనివర్సిటీల్లోనూ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇందులో భాగంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు వచ్చే విద్యా సంవత్సరం నుంచి పీజీలో డ్యూయల్‌ డిగ్రీ అందించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారు. అంటే ఒకేసా రి రెండు పీజీ కోర్సులు పూర్తిచేసే అవకాశాన్ని విద్యార్థులకు కల్పించనున్నారు. దీనివల్ల విద్యార్థికి ఆసక్తి ఉన్న రెండు విభిన్నమైన కోర్సులను ఒకేసారి పూర్తిచేసేందుకు అవకాశం లభించనుంది. ఉదాహరణకు ఎంఏ పాలిటిక్స్‌ చేసే విద్యార్థి ఈ కోర్సు చదువుతూనే, ఎంకామ్‌ చేసుకునే అవకాశం ఉంది. ఈ రెండు కోర్సులను ఒకేసారి పూర్తిచేసి ఒకవైపు ఎంఏ పాలిటిక్స్‌, మరోవైపు ఎంకామ్‌ పట్టాలను పొందవచ్చు. ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌, అకడమిక్‌ సెసేట్‌ ఆమోదం కోసం వేచి చూస్తున్నామని, అనుమతి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని వర్సిటీ అధికారులు చెబుతున్నారు.

కోర్సులు డిజైన్‌ చేసే యోచన

డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌ను అమలుచేయాలని భావిస్తు న్న ఏయూ అధికారులు ఎక్కువ మంది విద్యార్థులకు ఉప యుక్తంగా ఉండే కోర్సులను డిజైన్‌ చేసే పనిలో నిమగ్నమ య్యారు. రెండు డిగ్రీలతో బయటకు వెళ్లిన వెంటనే ఏదో ఒక డిగ్రీ పట్టాతో ఉద్యోగం లభించేలా డిజైన్‌ చేయబోతున్నారు. డ్యూయల్‌ డిగ్రీ ప్రోగ్రామ్‌కు సంబంధించిన కోర్సులు డిజైన్‌, సబ్జెక్టులు, పరీక్షలు నిర్వహణ వంటి అంశాలకు సంబంధిం చిన కరసత్తు చేస్తున్నట్టు వర్సిటీ అధికారులు చెబుతున్నారు. రెండు మేజర్‌ సబ్జెక్టులు పూర్తిచేసినట్టుగానే విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించనున్నారు.

ఇంజనీరింగ్‌లో అమలు..

ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో ప్రస్తుతం డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని అమలుచేస్తున్నారు. అయితే, పేరెంట్‌ డిపార్టుమెం ట్‌ మేజర్‌ సబ్జెక్ట్‌గా, ఎంపిక చేసుకున్న డిపార్టుమెంట్‌ మైనర్‌ సబ్జెక్ట్‌గా ప్రస్తుతం అమలుచేస్తున్నారు. మూడో ఏడాది చదు వుతున్న విద్యార్థులకు ప్రస్తుతం ఈ అవకాశం కల్పిస్తున్నారు. మైనర్‌ డిగ్రీ పొందాలనుకునే విద్యార్థులు రెగ్యులర్‌ సబ్జెక్టుల తోపాటు అదనంగా నాలుగు సబ్జెక్టులు చదవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇనుస్ర్టుమెంటేషన్‌, కెమికల్‌, సివిల్‌, మెకానికల్‌, ఎలక్ర్టికల్‌, ఎలక్ర్టానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెటలర్జీ, మెరె ౖన్‌, పర్యావరణ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు మైనర్‌ డిగ్రీగా కంప్యూటర్‌ సైన్స్‌ అందించనున్నారు. వీరికి డేటా స్ట్రక్చర్‌, సీ లాంగ్వేజ్‌, పైథాన్‌, మ్యాట్‌ లాబ్‌ వంటి కోర్సులు నేర్పిస్తారు. ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో అన్ని బ్రాంచీల విద్యార్థులకు సీఎస్‌ఈ చదివే అవకాశం ఇవ్వనున్నారు. మూ డు, నాలుగో ఏడాదిలో మైనర్‌ డిగ్రీ చదివాల్సి ఉంటుంది.

ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి

డ్యూయల్‌ డిగ్రీ విధానంతో విద్యార్థులకు మేలు జరుగుతుంది. ఒకేసారి రెండు ప్రధానమైన డిగ్రీలను పొంద డం వల్ల మార్కెట్‌లో ఏ డిగ్రీకి డిమాండ్‌ ఉందో దానికి సంబంధించిన ఉద్యోగాల్లో చేరేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల నిరుద్యోగం చాలావరకు తగ్గుతుంది. అదే సమయం లో విద్యార్థులకు విభిన్న అంశాలపై నాలెడ్జ్‌ పెరుగుతుంది. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ విద్యార్థులకు మేజర్‌, మైనర్‌ కాన్సెప్ట్‌ తో ఈ విధానాన్ని అమలుచేస్తున్నాం. మూడో ఏడాది చదువు తున్న విద్యార్థులు మైనర్‌ సబ్జెక్ట్‌గా కంప్యూటర్‌ సైన్స్‌ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాం. వచ్చే ఏడాది నుంచి పీజీ కోర్సుల్లో అమలుచేయాలని భావిస్తున్న డ్యూయల్‌ డిగ్రీ విధానంలో మాత్రం రెండు కోర్సుల సబ్జెక్టులు మేజర్‌గానే ఉంటాయి.

- ప్రొఫెసర్‌ జి.శశిభూషణరావు, ఏయూ ఇన్‌చార్జి వైస్‌ చాన్సలర్‌

Updated Date - Sep 16 , 2024 | 01:15 AM