అసంపూర్తిగా ఆర్‌బీకే భవనాలు
ABN , Publish Date - Dec 15 , 2024 | 12:43 AM
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్ల క్రితం ఈ భవనాల నిర్మాణాలు నిలిచి పోయాయి. మండలంలోని 23 గ్రామ సచివాలయాలకు గానూ 23 రైతు భరోసా కేంద్రాలకు భవనాలను గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది.
- కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించని గత వైసీపీ ప్రభుత్వం
- రెండేళ్ల క్రితం నిలిచిపోయిన పనులు
కొయ్యూరు, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అట్టహాసంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) భవనాలు అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకపోవడంతో రెండేళ్ల క్రితం ఈ భవనాల నిర్మాణాలు నిలిచి పోయాయి. మండలంలోని 23 గ్రామ సచివాలయాలకు గానూ 23 రైతు భరోసా కేంద్రాలకు భవనాలను గత వైసీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. ఒక్కో భవనానికి రూ.20 లక్షలు చొప్పున నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. ఇంజనీరింగ్ అధికారుల ఒత్తిడి మేరకు కాంట్రాక్టర్లు 10 కేంద్రాల భవనాలను పూర్తి చేశారు. అయితే వాటికి గత వైసీపీ ప్రభుత్వం ఫైనల్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. కాగా బూదరాళ్ల, కొండగోకిరి, కొయ్యూరు, రాజేందప్రాలెం, మర్రివాడ, ఆడాకుల, ఎం.మాకవరం, వెలగలపాలెం, చిట్టింపాడు కేంద్రాల భవన నిర్మాణ పనులు నిలిచిపోయి రెండేళ్లుగా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం స్పందించి ఈ భవనాల నిర్మాణ పనులు పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తేవాలని పలువురు కోరుతున్నారు.