Share News

అదుపులోకి రాని అతిసార

ABN , Publish Date - Dec 22 , 2024 | 01:05 AM

మండలంలోని భరణికంలో అతిసార అదుపులోకి రాలేదు. శనివారం మరో నలుగురు డయేరియా బారిన పడ్డారు. ఈ గ్రామంలో ఆరు రోజుల క్రితం అతిసార ప్రబలడంతో 18 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సాధారణ స్థితికి రావడంతో 16 మంది ఇళ్లకు చేరుకున్న సంగతి తెలిసిందే.

అదుపులోకి రాని అతిసార
పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న ఇందల అమ్మాజీ

భరణికంలో పెరుగుతున్న బాధితులు

పరవాడ, డిసెంబరు 21 (ఆంధ్రజ్యోతి): మండలంలోని భరణికంలో అతిసార అదుపులోకి రాలేదు. శనివారం మరో నలుగురు డయేరియా బారిన పడ్డారు. ఈ గ్రామంలో ఆరు రోజుల క్రితం అతిసార ప్రబలడంతో 18 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొంది సాధారణ స్థితికి రావడంతో 16 మంది ఇళ్లకు చేరుకున్న సంగతి తెలిసిందే. గ్రామానికి చెందిన ఇందల అమ్మాజీ(70), పెదిరెడ్ల రమ్యశ్రీ(17), ఎం.పావని(17), సుంకర సత్యారావు (60)లకు శనివారం ఉదయం వాంతులు, విరేచనాలు కావడంతో కుటుంబసభ్యులు పరవాడ పీహెచ్‌సీకి తరలించారు. ప్రస్తుతం అక్కడ వైద్యసేవలు పొందుతున్నారు. కాగా గత బుధవారం 13 మంది, గురువారం నలుగురు, శుక్రవారం ఒకరు, శనివారం నలుగురితో కలిపి మొత్తం 22 మంది డయేరియా బారిన పడ్డారు. వీరిలో ఇప్పటి వరకు 16 మంది సాధారణ స్థితికి రావడంతో ఇళ్లకు చేరుకున్నారు. మిగతా ఆరుగురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. డయేరియా అదుపులోకి రాకపోవడంతో గ్రామంలో వైద్య శిబిరాన్ని కొనసాగిస్తున్నారు. వైద్యురాలు జయశ్రీ కరిష్మా పర్యవేక్షణలో రోగులను పరీక్షించి మందులు అందజేస్తున్నారు.

Updated Date - Dec 22 , 2024 | 01:05 AM