Share News

రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన!

ABN , Publish Date - Dec 07 , 2024 | 01:17 AM

దీర్ఘకాలంగా పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభిస్తున్నది. భూ సంబంఽధిత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. మండల రెవెన్యూ అధికారులు రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఆయా మండలాల్లో రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖస్తులు స్వీకరిస్తున్నారు. తొలిరోజు సదస్సుకు అర్జీలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో భూ యజమానులు హాజరై సమస్యలపై అర్జీలు అందజేశారు. రెవెన్యూ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు జరగనున్నాయి.

రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన!
అనకాపల్లి మండలం కోడూరులో నిర్వహించిన రెవెన్యూ సదస్సులో అర్జీదారులతో మాట్లాడుతున్న జాయింట్‌ కలెక్టర్‌ ఎం.జాహ్నవి. చిత్రంలో ఆర్డీవో షేక్‌ ఆయిషా వున్నారు.

భూసంబంధిత సమస్యలపై ఫిర్యాదుల వెల్లువ

తొలిరోజు 25 గ్రామ సభలు, 379 దరఖాస్తుల స్వీకరణ

16 అర్జీలకు అక్కడికక్కడే పరిష్కారం

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

దీర్ఘకాలంగా పేరుకుపోయిన భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన రెవెన్యూ సదస్సులకు అనూహ్య స్పందన లభిస్తున్నది. భూ సంబంఽధిత సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం జిల్లా వ్యాప్తంగా అన్ని రెవెన్యూ గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. మండల రెవెన్యూ అధికారులు రూపొందించిన షెడ్యూల్‌ ప్రకారం ఆయా మండలాల్లో రెవెన్యూ గ్రామాల్లో సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖస్తులు స్వీకరిస్తున్నారు. తొలిరోజు సదస్సుకు అర్జీలు వెల్లువెత్తాయి. పెద్ద సంఖ్యలో భూ యజమానులు హాజరై సమస్యలపై అర్జీలు అందజేశారు. రెవెన్యూ సదస్సులు జనవరి 8వ తేదీ వరకు జరగనున్నాయి.

అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌లలోనిఇ 24 మండలాల్లో 721 రెవెన్యూ గ్రామాలుండగా తొలిరోజు శుక్రవారం 25 గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు విజయవంతంగా జరిగాయి. భూ యజమానులు అధిక సంఖ్యలో సదస్సులకు హాజరై దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం కోరుతూ అర్జీలు పెట్టుకున్నారు. అధికారులు స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు అక్కడిక్కడే రశీదులు ఇచ్చారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం 45 రోజుల్లో సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపారు, ఇతరత్రా వివరాలను దరఖాస్తుదారులకు తెలియపరుస్తారు.

తొలిరోజు 25 సదస్సులు.. 379 అర్జీలు

జిల్లాలో తొలి రోజు అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో 11 సదస్సులు, నర్సీపట్నం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 12 మండలాల్లో 14.. మొత్తం 25 సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి 379 దరఖాస్తులు స్వీకరించారు. 22ఏ ప్రభుత్వ భూ రికార్డు నుంచి తొలగింపు కోరుతూ ఐదు దరఖాస్తులు, వెబ్‌ల్యాండ్‌లో తప్పుల సవరణ కోసం 26, వారసత్వంగా సంక్రమించిన భూముల బదలాయింపు (మ్యుటేషన్‌) కోసం 174, భూకబ్జాలపై 6, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై 3, రీసర్వే సమస్యలపై 3, అటవీ భూముల ఆక్రణపై 4, దేవదాయ శాఖ భూముల కబ్జాలపై 4, ఇతరత్రా భూసంబంధిత సమస్యలపై 154.. మొత్తం 379 దరఖాస్తులు అందాయి. సుమారు 425 ఎకరాల భూములకు సంబంధించి 395 మంది రెవెన్యూ సదస్సులకు హాజరై తమ అర్జీలను సమర్పించారు. వీటిలో 16 అర్జీలకు సదస్సులో అక్కడికక్కడే పరిష్కారం చూపారు. ఇంకా 363 దరఖాస్తులను పరిశీలించి చర్యలు చేపట్టాల్సి ఉంది.

Updated Date - Dec 07 , 2024 | 01:17 AM