దిశ మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా ఉపేంద్రబాబు బాధ్యతల స్వీకారం
ABN , Publish Date - Feb 12 , 2024 | 12:17 AM
అనకాపల్లి దిశ మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా ఎం. ఉపేంద్రబాబు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు సీసీఎస్ సీఐగా పనిచేసిన ఆయనకు ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి ఇచ్చి దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు.
అనకాపల్లి టౌన్, ఫిబ్రవరి 11: అనకాపల్లి దిశ మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీగా ఎం. ఉపేంద్రబాబు ఆదివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు సీసీఎస్ సీఐగా పనిచేసిన ఆయనకు ప్రభుత్వం డీఎస్పీగా పదోన్నతి ఇచ్చి దిశ మహిళా పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన డీఎస్పీ ఎం.మహేశ్వరరావు అమలాపురానికి బదిలీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా డీఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ మహిళా చట్టాలపై కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామన్నారు.