Share News

వంజంగి మేఘాల కొండపై సందడి

ABN , Publish Date - Nov 13 , 2024 | 11:46 PM

సహజసిద్ధ అందాలకు నెలవైన పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు.

వంజంగి మేఘాల కొండపై సందడి
వంజంగి మేఘాల కొండపై పర్యాటకుల సందడి

పోటెత్తిన పర్యాటకులు

పాడేరురూరల్‌, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): సహజసిద్ధ అందాలకు నెలవైన పాడేరు మండలంలోని వంజంగి మేఘాల కొండకు బుధవారం పర్యాటకులు పోటెత్తారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ తదితర రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. పర్యాటక సీజన్‌ మొదలు కావడం, పిక్నిక్‌ల సందడి ప్రారంభం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు పాడేరుకు మంగళవారం సాయంత్రమే చేరుకున్నారు. పాడేరులో రాత్రి బస చేసి బుధవారం ఉదయం 5 గంటలకు మేఘాల కొండకు చేరుకున్నారు. పాల సముద్రాన్ని తలపించే మంచు మేఘాలు, సూర్యోదయం వేళ భానుడి కిరణాలు మంచును చీల్చుకుంటూ వచ్చే అద్భుత దృశ్యాలను తిలకించి పరవశించిపోయారు. అనంతరం వీరంతా జి.మాడుగుల మండలం కొత్తపల్లి జలపాతాన్ని తిలకించేందుకు పయనమయ్యారు.

Updated Date - Nov 13 , 2024 | 11:46 PM