Share News

జల వనరుల నిర్వహణ, సంరక్షణలో విశాఖకు జాతీయ అవార్డు

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:47 AM

జల వనరుల నిర్వహణ, సంరక్షణలో 2023 సంవత్సరానికిగాను సౌత్‌ జోన్‌ విజేతగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ జిల్లా ఎంపికైంది.

జల వనరుల నిర్వహణ, సంరక్షణలో విశాఖకు జాతీయ అవార్డు

మహారాణిపేట, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి):

జల వనరుల నిర్వహణ, సంరక్షణలో 2023 సంవత్సరానికిగాను సౌత్‌ జోన్‌ విజేతగా ఆంధ్రప్రదేశ్‌ నుంచి విశాఖ జిల్లా ఎంపికైంది. ఈ మేరకు మంగళవారం న్యూఢిల్లీలో కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ అవార్డును స్వీకరించారు. కలెక్టర్‌తోపాటు తూర్పు నౌకాదళం పాలనాధికారి టీఎస్‌ఎన్‌ రత్నకుమార్‌ అవార్డు తీసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌, పలువురు కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు జాతీయ స్థాయి అవార్డు రావడం వెనుక పలు శాఖల కృషి ఉందని కలెక్టర్‌ హరేంధిర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. జల వనరులు, మైక్రో ఇరిగేషన్‌, ఉద్యానవన, అటవీ శాఖలు, జీవీఎంసీ పబ్లిక్‌ హెల్త్‌, కాలుష్య నియంత్రణ మండలి, ఉపాధి హామీ పథకం అమలు చేసే డ్వామా, విద్య, వైద్య శాఖల పాత్రను గుర్తుచేశారు. జిల్లాకు అవార్డు రావడానికి గత కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌, ఆయా శాఖల అధికారుల కృషి ఉందని కొనియాడారు.

Updated Date - Oct 23 , 2024 | 12:47 AM