Share News

వీఎంఆర్‌డీఏ కొత్త లేఅవుట్లు

ABN , Publish Date - Nov 14 , 2024 | 01:12 AM

విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కొత్త లేఅవుట్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. వైసీపీ ప్రభుత్వంలో ఎంఐజీ టౌన్‌షిప్‌లు వేసినా పెద్దగా స్పందన రాలేదు. ఆనందపురం మండలం పాలవలస మినహా మిగిలినచోట్ల లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సంస్థకు ఉన్న భూముల్లో లేఅవుట్లు వేయాలని నిర్ణయించింది. మొత్తం 46 ఎకరాల్లో 538 ప్లాట్లు వచ్చేలా ప్లానింగ్‌ విభాగం ప్రణాళికలు రూపొందించింది.

వీఎంఆర్‌డీఏ  కొత్త లేఅవుట్లు

విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఏర్పాట్లు

నాలుగు ప్రాంతాల్లో 46 ఎకరాల్లో 538 ప్లాట్లు

ఏడాదిలోగా ప్లాట్లను వేలానికి సిద్ధం చేయాలని నిర్ణయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) కొత్త లేఅవుట్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. వైసీపీ ప్రభుత్వంలో ఎంఐజీ టౌన్‌షిప్‌లు వేసినా పెద్దగా స్పందన రాలేదు. ఆనందపురం మండలం పాలవలస మినహా మిగిలినచోట్ల లేఅవుట్లలో ప్లాట్ల కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సంస్థకు ఉన్న భూముల్లో లేఅవుట్లు వేయాలని నిర్ణయించింది. మొత్తం 46 ఎకరాల్లో 538 ప్లాట్లు వచ్చేలా ప్లానింగ్‌ విభాగం ప్రణాళికలు రూపొందించింది.

- భీమిలి మండలం కాపులుప్పాడలో 20.48 ఎకరాల్లో 209 ప్లాట్లు వేసేందుకు ప్లాన్‌ సిద్ధం చేసింది. ఆ భూమిని అభివృద్ధి చేయడానికి రూ.14.51 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసింది. వాటిని విక్రయిస్తే రూ.86 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.

- భీమిలి మండలం నిడిగట్టులో 8.15 ఎకరాలలో 103 ప్లాట్లు వేయడానికి రూ.519 కోట్లు ఖర్చుతో ప్రణాళిక వేశారు. వీటి అమ్మకం ద్వారా రూ.23 కోట్లు వసుందని భావిస్తున్నారు.

- పెందుర్తి మండలం చినముషిడివాడలో 4.7 ఎకరాలలో 84 ప్లాట్లు వేయడానికి రూ.3.1 కోట్లు ఖర్చు అవుతుందని, వాటి విక్రయం ద్వారా రూ.40 కోట్లు వస్తుందని అంచనా వేశారు.

- అనకాపల్లి మండలం తుమ్మపాలలో 12.68 ఎకరాలలో 142 ప్లాట్లు వేయడానికి రూ.5 కోట్లు ఖర్చు అవుతుందని, వాటి విక్రయం ద్వారా రూ.35 కోట్లు వస్తుందని అంచనా.

ఈ ప్రాజెక్టులను ఏడాది సమయంలోగా అభివృద్ధి చేసి ప్లాట్లను వేలానికి సిద్ధం చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. లేఅవుట్ల అభివృద్ధిలో భాగంగా బీటీ రహదారులు, విద్యుద్దీకరణ, పార్కుల నిర్మాణం, 60 అడుగుల రహదారులకు డివైడర్లు, సీసీ కాలువలు, కల్వర్టులు, ఎవెన్యూ ప్లాంటేషన్‌ చేయనున్నారు. ఈ ప్రతిపాదలన్నీ పురపాలక శాఖ ఆమోదం కోసం అమరావతి పంపించారు. ఆమోదం లభిస్తే టెండర్లు పిలిచి లేఅవుట్లు అభివృద్ధి చేస్తారు. ఆ తరువాత ప్లాట్లను వేలం ద్వారా విక్రయిస్తారు.

Updated Date - Nov 14 , 2024 | 01:12 AM