ఏయూలో ఏంజరుగుతోంది?
ABN , Publish Date - Dec 30 , 2024 | 01:12 AM
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ వ్యవహారాలపై ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ జి.శశిభూషణరావు ప్రొఫెసర్ మల్లికార్జున నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ అనేక అంశాలను పరిశీలించి, నివేదికను సమర్పించింది. అయితే ఆ వివరాలను ఇప్పటికీ అధికారులు వెల్లడించ లేదు. దీనిపై సీనియర్ ప్రొఫెసర్లు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
టీడీఆర్ హబ్ అక్రమాలపై విచారణకు కమిటీని నియమించిన ఇన్‌చార్జి వీసీ
నివేదిక సమర్పించినా గోప్యత
తాజాగా కాలేజీ ప్రినిపాళ్లకు ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశం
విశాఖపట్నం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి నెలకొంది. వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ట్రాన్స్ డిసిప్లినరీ రీసెర్చ్ (టీడీఆర్) హబ్ వ్యవహారాలపై ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ జి.శశిభూషణరావు ప్రొఫెసర్ మల్లికార్జున నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. ఈ కమిటీ అనేక అంశాలను పరిశీలించి, నివేదికను సమర్పించింది. అయితే ఆ వివరాలను ఇప్పటికీ అధికారులు వెల్లడించ లేదు. దీనిపై సీనియర్ ప్రొఫెసర్లు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉండగా టీడీఆర్ హబ్‌లో ప్రవేశా లు పొందిన వారికి ఇబ్బందులు లేకుండా ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వారికి ప్రీ పీహెచ్‌డీ పరీక్షలు నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు అందినట్టు తెలిసింది. దీనిపై పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. విచారణ నివేదిక వివరాలు వెల్లడించి, అనుమానాలను నివృత్తి చేసిన తరువాత పరీక్షలు నిర్వహిస్తే మేలనే అభిప్రాయాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు ప్రిన్సిపాళ్లు ప్రీ పీహెచ్‌డీ పరీక్షల నిర్వహణకు వీలుగా కాలేజీ రీసెర్చ్ కమిటీ (సీఆర్‌సీ) సమావేశాలు నిర్వహించి ప్రక్రియను కొనసాగిస్తున్నారని చెబుతున్నారు. తాజాగా ఈ వ్యవహారం వర్సిటీలో వివాదం రాజేస్తోంది. దీంతో కొంతమంది మంత్రి నారా లోకేశ్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.