Share News

Botsa: సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స

ABN , Publish Date - Dec 09 , 2024 | 02:02 PM

Andhrapradesh: విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్ససత్యనారాయణ తెలిపారు. ‘‘డ్రగ్స్‌కు సంబంధించి మాపై విష ప్రచారం చేశారు.. ఎన్నికల్లో లబ్ధి పొందారు’’ అంటూ విరుచుకుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు.

Botsa: సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన బొత్స
YSRCP MLC Botsa Satyanarayana

విశాఖపట్నం, డిసెంబర్ 9: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు ఎన్నో మాటల తూటాలు పేలారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను కూడా ఎన్నో సార్లు తప్పుబట్టారు. వైసీపీ పాలనే బెటర్ అంటూ పోకడలకు పోయారు కూడా. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌ను ఉద్దేశిస్తూ ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ (MLC Botsa Satyanarayana) పలు వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu), కూటమి ప్రభుత్వానికి (AP Govt) ధన్యవాదాలు తెలియజేశారు. వైసీపీ హయాంలో నాడు- నేడు కార్యక్రమంలో చేపట్టిన అభివృద్ధి పనులు పేరెంట్ టీచర్స్ మీటింగ్‌లో కనిపించాయంటూ కామెంట్స్ చేశారు.

Kadapa: విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ పీఏ


బొత్స ఇంకా మాట్లాడుతూ.. విశాఖలో డ్రగ్స్ వ్యవహారంపై తాను మళ్ళీ కేంద్రానికి లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ‘‘డ్రగ్స్‌కు సంబంధించి మాపై విష ప్రచారం చేశారు.. ఎన్నికల్లో లబ్ధి పొందారు’’ అంటూ విరుచుకుపడ్డారు. ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజా ప్రతినిధులు పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించామని తెలిపారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించిందన్నారు. వర్షాల నేపథ్యంలో రైతాంగం ఇబ్బందులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈనెల13 వ తేదీన అన్ని కలక్టరేట్‌లో వినతిపత్రలు అందజేస్తామన్నారు. ఈనెల 27వ తేదీన విద్యత్ చార్జీలు పెంపుపై విద్యుత్ కార్యాలయాలలో వినతిపత్రలు అందజేయనున్నట్లు వెల్లడించారు. విద్యుత్ భారాలను ప్రభుత్వమే భరించాలని డిమాండ్ చేశారు.

YSRCP: జగన్‌కు రూ. 3100 కోట్ల ముడుపులు..


ఫీజ్ రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని జనవరి 3న కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలన్నారు. సీబీఐ కంటైనర్‌లో డ్రగ్స్ లేదని సీబీఐ చెప్పడంతో.. విశాఖపై ఉన్న డ్రగ్స్ మచ్చ పోయిందన్నారు. అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానిపై కేంద్ర హోంమంత్రికి లేఖ రాయనున్నట్లు తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు మేనేజ్‌కు గురైతే ఏపీ పరువు పోతుందన్నారు. సిట్ రిపోర్ట్‌ను బహిర్గతం చేయాలని లేఖ రాస్తానన్నారు. విశాఖ డైరీపై వేసిన సభా సంఘంపై ఎమ్మెల్సీలను భాగస్వామ్యం చేయాలని లేఖ రాసినట్లు తెలిపారు. సభా సంఘంలో శాసనమండలిలోని సభ్యులను భాగస్వామ్యం చేయాలన్నారు. ధాన్యం కొనుగోలుపై మంత్రి నాదెండ్ల మాటలు.. పరుచూరి బ్రదర్స్ డైలాగ్స్‌లా ఉన్నాయని ఎద్దేవా చేశారు. ‘‘గతంలో వేసిన సిట్ నివేదికలను మేము పెట్టలేకపోయాం... ఇప్పుడు కూటమి ప్రభుత్వమే ఉంది కదా.. ఎవరిది తప్పు ఉంటే వారిపై చర్యలు తీసుకోండి’’ అంటూ ఎమ్మెల్సీ బొత్స సత్యానారాయణ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

జానీ మాస్టర్‌కు మరో బిగ్ షాక్..

Lanka Dinakar: రంగంలోకి సిట్.. వారి ఆట కట్టిస్తాం.. లంకా దినకర్ మాస్ వార్నింగ్

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 09 , 2024 | 02:04 PM