108 వ్యవస్థను ప్రభుత్వమే నిర్వహించాలి
ABN , Publish Date - Nov 24 , 2024 | 12:05 AM
ప్రభుత్వమే 108 వాహన వ్యవస్థను నిర్వహించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి.
బెలగాం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వమే 108 వాహన వ్యవస్థను నిర్వహించాలని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శనివారం స్థానిక గిరిజన భవన్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ 108 సర్వీసులను ప్రైవేటు సంస్థల కు అప్పజెప్పడంతో సేవల్లో నాణ్యతా ప్రమాణాలు కొరవడుతున్నాయని అన్నారు. ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు జి.రవికు మార్, ఎన్జీవో జిల్లా అధ్యక్షులు కిషోర్, జనసేన నాయకుడు శ్రీను, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు కిషోర్, సీఐటీయూ నాయకులు సుబ్బరావమ్మ, పాకల సన్యాసి, వంగల దాలినాయుడు పాల్గొన్నారు.