Share News

14న నీటి సంఘాల ఎన్నికలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:37 AM

ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కాగా 14వ తేదీకల్లా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.

14న నీటి సంఘాల ఎన్నికలు

సమాయత్తమవుతున్న అధికారులు

జియ్యమ్మవలస, డిసెంబరు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం నీటి సంఘాల ఎన్నికలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ నెల 11న నోటిఫికేషన్‌ విడుదల కాగా 14వ తేదీకల్లా ఎన్నికలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో నీటి పారుదలశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. వాస్తవానికి ఈ నెల 5 నుంచి 14వ తేదీ వరకు ఈ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో తుఫాన్‌ నేపథ్యంలో రద్దు చేసింది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం ఏర్పాట్లు చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. మరోవైపు గ్రామస్థాయిలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జిల్లాలోని వీఆర్‌ఎస్‌, వట్టిగెడ్డ, పెద్దగెడ్డ, పెదంకలాం , తోటపల్లి, రెండు మైనర్‌ ఇరిగేషన్‌ ప్రాక్టుల పరిధిలో 213 సంఘాలు ఉన్నాయి. వాటిల్లో 1560 టెరిటోరియల్‌ కాన్‌స్టిట్యుయెన్సీ (టీసీ) సభ్యులు ఉన్నారు. 11న నోటిఫికేషన్‌ జారీ అవ్వగా, 12న సంఘాల అధ్యక్ష, ఉపాధ్యక్షులు ఎన్నుకుంటారు. 13న డిస్ట్రిబ్యూటరీ కమిటీలు, 14న ప్రాజెక్టు కమిటీలకు నీటి పారుదలశాఖ, కలెక్టర్‌ పర్యవేక్షణలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఎస్‌.సుగుణాకరరావు తెలిపారు.

Updated Date - Dec 07 , 2024 | 12:37 AM