25 నుంచి 108 వాహన ఉద్యోగుల సమ్మె
ABN , Publish Date - Nov 14 , 2024 | 12:30 AM
న్యాయ మైన సమస్యలు పరి ష్కరిం చకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు 108 వాహన ఉద్యోగులు ప్రకటించా రు. బుధవా రం కలెక్టరేట్ వద్ద 108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహిం చారు.
విజయనగరం కలెక్టరేట్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): న్యాయ మైన సమస్యలు పరి ష్కరిం చకపోవడంతో ఈనెల 25 నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు 108 వాహన ఉద్యోగులు ప్రకటించా రు. బుధవా రం కలెక్టరేట్ వద్ద 108 ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహిం చారు. ఈ సందర్బంగా సంఘ నాయకులు మాట్లాడుతూ 108 వ్యవస్ధలో నిర్వహణ సంస్థలను మార్పు చేసే ప్రతిసారి ఉద్యోగులకు గ్రాట్యూటీ, ఎర్నడ్‌లీవులకు సంబంధించిన డబ్బులు ఇవ్వకుండా సంస్థలు వైదొలగుతున్నాయని అన్నారు. దీని వల ఆర్ధికంగా తీవ్రంగా నష్టపోతున్నామని చెప్పారు. ప్రభుత్వం స్పందించి 108 ఉద్యోగులను వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 2017లోని అప్పటి టీడీపీ ప్రభుత్వం జీవో 49 ద్వారా ప్రతి ఉద్యోగికి నేరుగా రూ.4000 చెల్లించేదని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వం దీనిని రద్దు చేసిందని తెలిపారు. దీన్ని తిరిగి పునరుద్ధరించాలని కోరారు. ఈ సమస్యలను పరిష్కరించాలని... లేని పక్షంలోని సమ్మెకు వెళతామని ఉద్యోగులు తెలిపారు.