police recrutment 321 మందే హాజరు
ABN , Publish Date - Dec 30 , 2024 | 11:07 PM
321 people attended పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తొలిరోజు 321 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పీఎంటీ, పీఈటీ పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది.
321 మందే హాజరు
కానిస్టేబుల్ నియామక ప్రక్రియ ప్రారంభం
తొలి రోజు 600 మందికి పిలుపు
విజయనగరం క్రైం, డిసెంబరు 30(ఆంధ్రజ్యోతి): పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల ప్రక్రియకు తొలిరోజు 321 మంది మాత్రమే హాజరయ్యారు. ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు సోమవారం నుంచి జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో పీఎంటీ, పీఈటీ పరీక్షల ప్రక్రియ ప్రారంభమైంది. 600 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి వుండగా, 321 మంది మాత్రమే హాజర య్యారు. ఉదయం 4 గంటలకు ప్రక్రియ ప్రారంభించారు. ఎస్పీ వకుల్‌జిందాల్ పర్యవేక్షించారు. తొలుత అభ్యర్థుల హాల్ టిక్కెట్లు పరిశీలించి మైదానంలోకి అనుమతించారు. విద్యార్హతలు, రిజర్వేషన్, వయసు నిర్ధారించే ధ్రువపత్రాలను పరిశీలించి అన్నీ సక్రమంగా ఉన్న వారికి మాత్రమే బయోమెట్రిక్ తీసుకుని పీఎంటీ పరీక్షలకు అనుమతించారు. డిజిటల్ ఎక్విప్‌మెంట్ వినియోగించి అభ్యర్థుల ఎత్తు, చాతి కొలతలు నిర్వహించారు. ప్రక్రియ పూర్తి పారదర్శకంగా నిష్పక్షపాతంగా సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతోందని ఎస్పీ వకుల్‌జిందాల్ తెలిపారు. ఏఎస్‌పీలు సౌమ్యలత, జి.నాగేశ్వరరావు, డీఎస్పీలు యూనివర్స్, వీరకుమార్, బాపూజీ, టీఎన్ శ్రీనివాసరావు, థామస్ రెడ్డి, ఏవో శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.