Share News

మారేడుమిల్లి జలపాతంలో జిల్లా వైద్య విద్యార్థిని గల్లంతు

ABN , Publish Date - Sep 23 , 2024 | 12:12 AM

అల్లూరి జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని కొసిరెడ్డి సౌమ్య గల్లంతైంది.

మారేడుమిల్లి జలపాతంలో  జిల్లా వైద్య విద్యార్థిని గల్లంతు

బొబ్బిలి: అల్లూరి జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో జిల్లాకు చెందిన వైద్య విద్యార్థిని కొసిరెడ్డి సౌమ్య గల్లంతైంది. బొబ్బిలి పట్టణం రావువారి వీధికి చెందిన తాపీమేస్త్రి కొసిరెడ్డి అప్పలనాయుడు, రమాదేవి దంపతుల రెండో కుమార్తె సౌమ్య ఏలూరు ఆశ్రమవైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ రెండో సంవత్సరం చదువుతోంది. 13 మంది తోటి విద్యార్థినులతో కలసి సౌమ్య ఆదివారం విహార యాత్రకు వెళ్లింది. వీరిలో ఐదుగురు విద్యార్థినులు జలతరంగిణి జలపాతంలో గల్లంతయ్యారు. ఇద్దరిని స్థానికులు రక్షించి రాజమండ్రి, రంపచోడవరం ఆసుప త్రులకు తరలించినట్టు సమాచారం. సౌమ్యతో పాటు మరో ఇద్దరి ఆచూకీ లభ్యంకాలేదు. ఈ సమాచారం కుటుంబ సభ్యులకు తెలియడంతో రావువారి వీధిలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆ వార్డు నాయకులు బొత్స అప్పులు, కొసిరెడ్డి సూరిబాబు తదితరులు హుటాహుటిన ఆదివారం రాత్రి ఏలూరు బయలుదేరారు. సౌమ్యకు అక్క జ్యోత్స్న, తమ్ముడు సాయి ఉన్నారు.

Updated Date - Sep 23 , 2024 | 12:12 AM