Share News

‘గిరి’నే ఓడించిన గిరిజన బిడ్డ

ABN , Publish Date - May 10 , 2024 | 11:42 PM

ఓ ఎన్నిక దేశంలో ఉన్న అనేక మంది మేధావులను ఆలోచింపజేసింది. ఓ గిరిజనుడిని హస్తినలో అడుగుపెట్టే లా చేసింది. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రినే మంత్రము గ్ధుడిని చేసింది.

‘గిరి’నే ఓడించిన గిరిజన బిడ్డ
డిప్పల సూరిదొర

సాలూరు: ఓ ఎన్నిక దేశంలో ఉన్న అనేక మంది మేధావులను ఆలోచింపజేసింది. ఓ గిరిజనుడిని హస్తినలో అడుగుపెట్టే లా చేసింది. సాక్షాత్తూ దేశ ప్రధానమంత్రినే మంత్రము గ్ధుడిని చేసింది. అదే 1957 లో జరిగిన పార్వతీపురం లోక్‌సభ ఎన్నిక. 1957లో లోక్‌సభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్‌ వి డుదలైంది. ఆ నోటిఫికేష న్‌లో పార్వతీపురం లోక్‌సభ స్థానానికి సంబంధించి ఒ కరు రిజర్వుడు, మరొకరు జనరల్‌ స్థానానికి పోటీ చేయాల్సి ఉంది. రిజర్వుడు స్థానా నికి బిడ్డిక సత్యనారాయణ కాంగ్రెస్‌ పార్టీ నుంచి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా.. ప్రజా సోషలిస్ట్‌ పార్టీ నుంచి సాలూరు మండలంలోని మూకదొర తెగ కు చెందిన డిప్పల సూరిదొర పోటీ చేశారు. జనరల్‌ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ తరపున వీవీ గిరి కాడెద్దుల గుర్తుపై పోటీ చేయగా.. ప్రజా సోషలిస్ట్‌ పార్టీ నుంచి చెట్టు గుర్తుపై వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు పోటీ చేశారు. బ్యాలెట్‌ పత్రాలను వారికి సంబంధించిన గుర్తు ఉన్న పెట్టెలో వేస్తే సరిపోతుంది. పోటీ చేసిన నలుగురిలో అందరికంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి మొదటి గెలిచిన వ్యక్తిగా, తరువాతి స్థానంలో ఓట్లు వచ్చిన వ్యక్తి రెండో గెలిచినట్లు వ్యక్తిగా చూపిస్తారు. అలా జరిగిన ఎన్నికలో జనరల్‌ స్థానానికి వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడుపై వీవీ గిరి గెలుపొందారు. డిప్పల సూరిదొరపై బిడ్డిక సత్యనారాయణ గెలుపొందా రు. ఎన్నికల కమిషన్‌ డిప్పల సూరిదొర కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన బిడ్డిక సత్యనారాయణ గెలిచినట్టుగా ప్రకటించింది. అలాగే వాసిరెడ్డి కృష్ణమూర్తి నాయుడు కంటే ఎక్కువ ఓట్లు సాధించిన వీవీ గిరికి రిజర్వుడు స్థానానికి పోటీ చేసి ఓడిపోయిన డిప్పల సూరిదొర కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో ఎన్నికల కమిషన్‌ డిప్పల సూ రిదొరను విజేతగా ప్రకటించింది. జనరల్‌ స్థానం నుంచి వీవీ గిరి గెలిచినప్పటికీ రిజర్వుడు స్థానంలో ఓడిన అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు రావటంతో అప్పటి నిబంధనల మేరకు ఆయన్ను ఎన్నికల కమిషన్‌ ఓడిపోయినట్టుగా ప్రకటించింది.

ఢిల్లీకి పిలిపించుకున్న ప్రధానమంత్రి

దేశం గర్వించదగ్గ మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు వీవీ గిరిని ఓడించిన వ్యక్తిని తాను ఒక్కసారి చూడాలని.. తన వద్దకు తీసుకుని రావాలని అప్పట్లో కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తున్న విశాఖపట్నం వాసి తెన్నేటి విశ్వనాథాన్ని ప్రధాని నెహ్రూ కోరారు. దీంతో సూరిదొరకు ఓ వ్యక్తిని తోడుగా ఇచ్చి విశాఖపట్నం నుంచి ఢిల్లీకి పంపించారు. సూరిదొర ఢిల్లీకి సమీపంలో ఉన్న ఆగ్రాకు చేరుకోగానే టీ తాగేందుకు కిందకు దిగారు. ఇంతలో రైలు కదలటంతో అక్కడే ఉండిపోయారు. దీంతో సూరిదొరతో వచ్చిన వ్యక్తి ఢిల్లీకి చేరుకుని మొత్తం విషయాన్ని నెహ్రూకు వివరించారు. హిందీ, ఇంగ్లీషు బాషలు రాని సూరిదొర రైల్వే స్టేషన్‌లో ఓ చోట కూర్చున్నారు. వెంటనే తెలుగులో అన్ని రైల్వే కేంద్రాల్లో వినిపించేలా ప్రకటన ఇవ్వాలని సంబంధిత అధికారులకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అలా ఆగ్రా రైల్వే స్టేషన్‌లో ఆయనను గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే ప్రధానమంత్రి వద్దకు తీసుకుని వెళ్లారు. ఎంపీగా గెలిచిన సూరిదొరను రైల్వే బోర్డు మెంబర్‌గా నియమించారు. ఎంపీగా పదవీ కాలం పూర్తయిన తర్వత పాచిపెంట సమితి అధ్యక్షుడుగా కూడా ఆయన సేవలందించారు. అనంతర కాలంలో వీవీ గిరి భారత రాష్ట్రపతిగా సేవలందించారు.

Updated Date - May 10 , 2024 | 11:42 PM