Share News

కారు ఢీకొని మహిళ మృతి

ABN , Publish Date - Sep 13 , 2024 | 12:04 AM

మండలంలోని నిమ్మలపాలెం సమీపంలోని మలుపువద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ద్విచక్రవాహన్ని కారు ఢీకొన్న సంఘటనలో తల్లి మృతిచెందగా కుమారుడిగా గాయాలయ్యాయని సీఐ షణ్ముఖరావు తెలిపారు.

  కారు ఢీకొని మహిళ మృతి

కొత్తవలస:మండలంలోని నిమ్మలపాలెం సమీపంలోని మలుపువద్ద గల ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ద్విచక్రవాహన్ని కారు ఢీకొన్న సంఘటనలో తల్లి మృతిచెందగా కుమారుడిగా గాయాలయ్యాయని సీఐ షణ్ముఖరావు తెలిపారు. సీఐ కథనం మేరకు.. విశాఖపట్నంలోని దొండపర్తికి చెందిన మల్లంకి అచ్చమ్మ(50) తన కుమారుడు చంద్రశేఖర్‌తో ద్విచక్రవాహనంపై శృంగవరపుకోట నుంచి కొత్తవలస వైపు బుధవారం రాత్రి వెళ్తున్నారు. ఆ సమయంలో కొత్తవలస నుంచి శృంగవరపుకోట వెళ్తున్న కారు ఢీకొనడంతో ద్విచక్రవాహనం వెనుక కూర్చొన్న అచ్చమ్మతోపాటు ద్విచక్రవాహనం నడుపుతున్న చంద్రశేఖర్‌ తీవ్రంగా గాయపడ్డారు.వీరికి వారి బంధువులు కొత్తవలసలో ప్రథమ చికిత్సచేయించి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అచ్చమ్మ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అచ్చమ్మ అల్లుడు మల్లువలస సాంబశివరావు ఫిర్యాదుమేరకు కేసునమోదుచేశారు. అనంతరం పోస్టుమార్టానికి మృతదేహాన్ని తరలించారు.

అదృశ్యమైన ఫార్మా ఉద్యోగి మృతి

పరవాడ: ఫార్మాసిటీలోని అడ్మిరాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో మంగళవారం అదృశ్యమైన ఆర్‌.సూర్యనారాయణ(40) పరిశ్రమ ఆవరణలోని మిథనాల్‌ ట్యాంక్‌లో శవమై తేలా డు. ఈవిషయాన్ని గురువారం ఉదయం యాజమాన్యం గుర్తించిం ది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అడ్మిరాన్‌ లైఫ్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పరిశ్రమలో ప్రొడక్షన్‌ మేనేజర్‌గా పనిచేస్తున్న విజయనగరం జిల్లా వేపాడ మండలం లోని వీలుపర్తికి చెందిన ఆర్‌.సూర్యనారాయణ మంగళవారం జనరల్‌ షిఫ్ట్‌లో విధులకు హాజరయ్యాడు. సాయంత్రం ఐదు గంటలకు విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాల్సిఉంది. కానీ ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు బుధవారం ఉదయం పరిశ్రమ వద్దకు వచ్చి వాకబు చేశారు. ఎక్కడా ఆచూకీ లభించ లేదు. దీంతో కుటుంబీకులు పరవాడ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పరిశ్రమలోని ఉద్యోగులంతా గురువారం ఉదయం మరోసారి సూర్యనారాయణ కోసం అన్ని విభాగాల్లో గాలింపు చర్యలుచేపట్టారు. ఈ క్రమంలో మిథనాల్‌ ట్యాంకు పైకి ఎక్కి చూడగా అందులో సూర్యనారాయణ మృతదేహం కనిపించింది. అగ్నిమాపక సిబ్బంది మిథనాల్‌ ట్యాంకులోకి నీరు నింపి, సూర్యనారాయణ మృతదేహాన్ని పైకి తేలేలా చేసి బయటకుతీశారు.కాగా యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే సూర్య నారాయణ ప్రాణాలు కోల్పోయాడని, అందువల్ల బాధిత కుటుంబానికి కోటి రూ పాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ కుటుంబీకులు, బంధు వులు పరిశ్రమ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు గురువారం దిగారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించేందుకు పోలీసులు సిద్ధమవుతుండగా బంధువులు అడ్డుకున్నారు. కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తామని లిఖితపూర్వకంగా హామీఇవ్వాలని పట్టుబట్టారు.వివిధ రాజకీయ పార్టీల నాయకుల సమక్షం లో మృతుడి కుటుంబ సభ్యులు, పరిశ్రమ యాజమాన్య ప్రతినిధులకు మధ్య చర్చలు జరిగాయి. రూ.50 లక్షలు నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం మరో లక్ష రూపాయలు ఇచ్చేందుకు యాజమాన్యం అంగీకరించింది. అనంతరం సూర్యనారాయణ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. కాగా సూర్యనారాయణకు భార్య బాల పరమేశ్వరి, కుమార్తె జ్యోషిత, కుమారుడు సృజన్‌ ఉన్నారు. ఉద్యోగం నిమిత్తం కుటుంబంతో కలిసి గాజువాకలో నివాసముంటున్నాడు.

Updated Date - Sep 13 , 2024 | 12:04 AM