Share News

స్ర్టాంగ్‌ రూముల ఏర్పాటుకు చర్యలు

ABN , Publish Date - Feb 07 , 2024 | 11:41 PM

ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో స్ర్టాంగ్‌ రూముల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు భవనాల పరిశీలనలో నిమగ్నమయ్యారు.

 స్ర్టాంగ్‌ రూముల ఏర్పాటుకు చర్యలు
పాలకొండలో కళాశాల భవనాలను పరిశీలిస్తున్న పీవో

పాలకొండ/వీరఘట్టం/కురుపాం, ఫిబ్రవరి7: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో జిల్లాలో స్ర్టాంగ్‌ రూముల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు అధికారులు భవనాల పరిశీలనలో నిమగ్నమయ్యారు. దీనిలో భాగంగా పాలకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల జూనియర్‌ కళాశాలలను బుధవారం ఐటీడీఏ పీవో కల్పనాకుమారి సందర్శించారు. స్ర్టాంగ్‌ రూం ఏర్పాటుకు అవసరమయ్యే అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అన్ని సదుపాయాలు ఉన్న భవనాన్నే స్ర్టాంగ్‌ రూం కోసం ఎంపిక చేస్తామని ఆమె తెలిపారు. అనంతరం ఆమె వీరఘట్టంలోని సీబీఎం స్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సౌకర్యాలపై అధికారులకు తగు సూచనలు చేశారు. మరోవైపు కురుపాంలో జూనియర్‌ కళాశాల, వసతి గృహం రూములను పాలకొండ ఆర్డీవో బీవీ రమణ సందర్శించారు. 2019 ఎన్నికల సమయంలో ఈ కళాశాలలో ఈవీఎంలను ఎలా భద్రపరిచారని సీనియర్‌ అధ్యపకుడు ఎన్‌.మురళీకృష్ణ, వసతిగృహం వార్డెన్‌ సీహెచ్‌ సాంబమూర్తిని అడిగి తెలుసుకున్నారు. వారి వెంట తహసీల్దార్లు, డీటీ, ఆర్‌ఐ, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Updated Date - Feb 07 , 2024 | 11:41 PM