Share News

అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు: డీఆర్వో

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:07 AM

అటవీభూములను ఆక్రమించి సాగుచేస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్వో జమ్మాన సుధీర్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం కృష్ణాపురంలో విలేకరులతో మాట్లాడుతూ గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి సమీపప్రాంతాల్లో వందలాది ఎకరాల అటవీభూములను ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఆక్ర మించుకుని సాగు చేస్తున్నారని తెలిపారు.

అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు: డీఆర్వో

బొబ్బిలి రూరల్‌: అటవీభూములను ఆక్రమించి సాగుచేస్తే కఠిన చర్యలు తప్పవని డీఆర్వో జమ్మాన సుధీర్‌కుమార్‌ హెచ్చరించారు. శుక్రవారం కృష్ణాపురంలో విలేకరులతో మాట్లాడుతూ గోపాలరాయుడుపేట పంచాయతీ పరిధి సమీపప్రాంతాల్లో వందలాది ఎకరాల అటవీభూములను ఇతర ప్రాంతాలనుంచి వచ్చి ఆక్ర మించుకుని సాగు చేస్తున్నారని తెలిపారు. దీంతో వందలాది ఎకరాల్లో అటవీసంపద నాశన మయ్యిందని చెప్పారు.ప్రస్తుతం గోపాలరాయుడుపేట పంచాయితీలో అటవీ భూముల్లో 12 వేల మొక్కలు, షికారుగంజి ప్రాంతంలో సుమారు 25 వేల మొక్కలు నాటుతున్నామని తెలిపారు.

Updated Date - Sep 21 , 2024 | 12:07 AM