ఎయిర్‌ఫోర్స్‌లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Dec 30 , 2024 | 12:01 AM
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ ట్రేడుల్లో ఎయిర్‌మెన్‌గా చేరడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అదనపు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
పార్వతీపురం, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ ట్రేడుల్లో ఎయిర్‌మెన్‌గా చేరడానికి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అదనపు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసిందని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. మెడికల్ అసిస్టెంట్, ఫార్మాసిస్ట్ ట్రేడుల్లో ఎయిర్‌మెన్ ఉద్యోగాలకు శాశ్వత ప్రాతిపదికన నియామకం చేపడుతున్నారని తెలిపారు. జిల్లా నుంచి అధిక సంఖ్యలో యువత రిక్రూట్‌మెంట్‌లో ర్యాలీలో పాల్గొనాలని ఆయన కోరారు.
ఇంటర్ అర్హతతో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగం..
ఇంటర్మీడియట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టుతో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అన్ని సబ్జెక్టుల్లో సగటున 50 శాతం మార్కులు ఉండాలని, ఇంగ్లీష్‌లో కూడా 50శాతం మార్కులు రావాలని చెప్పారు. వివాహం కాని 2004 జూలై 1 నుంచి 2008 జూలై 3 మధ్యన పుట్టిన అభ్యర్థులు అర్హులన్నారు. బీఎస్సీ డిప్లొమా ఫార్మసీతో మెడికల్ అసిస్టెంట్ ఉద్యోగానికి ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్టుతో ఉతీర్ణులై ఉండాలన్నారు. సరా సరి 50 శాతం మార్కులు ఉండాలని, 50 శాతం మార్కు లు ఇంగ్లీష్‌లో కూడా రావాలన్నారు. ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష, రాతపరీక్ష, మెడికల్ పరీక్ష ఉంటాయని చెప్పారు. పైన పేర్కొన్న అర్హతలు కలిగి ఉన్న అభ్యర్థులు మహరాజస్స్ కాలేజ్ గ్రౌండ్, పీటీ ఉష రోడ్డు, షీనస్, ఎర్నాకులం, కొచ్చి కేరళ 682011 చిరునామాతో ఫిబ్రవరి 1, 2 తేదీల్లో జరిగే రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలం గాణాకు చెందిన అభ్యర్థులు హాజరు కావచ్చునని ఆయన తెలిపారు. మరిన్ని వివరాలకు 9177297528, 7993795 796, 7382559022, 6303493720 సంప్రదించాలన్నారు.