Share News

బావిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:13 AM

బావిలోకి దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలం లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఆర్‌.రమేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

బావిలో దూకి వృద్ధుడి ఆత్మహత్య

బొబ్బిలి: బావిలోకి దూకి వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలం లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఆర్‌.రమేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని దేవాంగులవీధికి చెందిన నారంశెట్టి మృత్యుంజయ రావు (70) గత కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతన్నాడు. ఎలర్జీ, ఒంటి నొప్పు లతో తీవ్రంగా బాధపడేవాడు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. దీంతో బాధ భరించలేక సోమవారం ఉదయం 3 గంటల సమయంలో మేదర బంద సమీపంలో బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మేరకు వివరాల న్నిటినీ మృతుని కుమారుడు రామచంద్రమూర్తి తమకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొ న్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీసి స్థానిక సీహెచ్‌ సీలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించామని ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - Oct 08 , 2024 | 12:13 AM