Andhra Pradesh: గంజాయి స్మగ్లర్ల అతి తెలివి.. మరి పోలీసులు ఏం చేశారో తెలుసా?!
ABN , Publish Date - Jan 19 , 2024 | 03:30 PM
Vizianagaram: విజయనగరంలో భారీగా గంజాయి పట్టుబడింది. జిల్లా కేంద్రంలోని గజపతి నగరం కాంప్లెక్స్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. ఖాకీల మాస్టర్ మైండ్ ముందు.. స్మగ్లర్స్ అడ్డంగా బుక్కైపోయారు. దాదాపు 95 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
విజయనగరం, జనవరి 19: ఖాకీల మాస్టర్ మైండ్ ముందు.. స్మగ్లర్స్ అడ్డంగా బుక్కైపోయారు. విజయనగరంలో భారీగా గంజాయి సీజ్ చేశారు. జిల్లా కేంద్రంలోని గజపతి నగరం కాంప్లెక్స్ వద్ద భారీగా గంజాయి పట్టుబడింది. దాదాపు 95 కేజీల గంజాయిని సీజ్ చేశారు పోలీసులు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ముగ్గురు స్మగ్లర్లు ఒడిశా నుంచి గంజాయిని తరలిస్తున్నారు. కారులో ప్యాకెట్ల రూపంలో గంజాయిని దాచి తీసుకువస్తున్నారు. అయితే, అప్పటికే గజపతినగరం కాంప్లెక్స్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అదే సమయంలో స్మగ్లర్లు కారుతో వచ్చారు. కారు మూమెంట్, కారులోని వ్యక్తుల తీరు అనుమానాస్పదంగా కనిపించడంతో.. పోలీసులు వారిని ఆపారు. కారును క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. సీట్ల కింద దాచిన 19 గంజాయి ప్యాకెట్లను గుర్తించారు పోలీసులు. దాంతో కారులోని ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. కారును, కారులోని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 95 కేజీల గంజాయి ఉందని పోలీసులు ప్రకటించారు. దీని విలువ సుమారు రూ. 3 లక్షలకు పైనే ఉంటుందని చెబుతున్నారు పోలీసులు.