ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీగా జిల్లా వాసి
ABN , Publish Date - Jul 19 , 2024 | 12:28 AM
మండలంలోని కొత్తపల్లికి చెందిన గొట్టాపు శశిభూషణ్ ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు.
గరుగుబిల్లి: మండలంలోని కొత్తపల్లికి చెందిన గొట్టాపు శశిభూషణ్ ఆంధ్రా యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్ చాన్సలర్‌గా నియమితులయ్యారు. ఈయన గత 21 ఏళ్లుగా ఏయూలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఏడాదిగా ఇంజినీరింగ్ కళాశాలకు ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. యూనివర్సిటీలో చేరక ముందు ఎయిర్‌పోర్ట్ అథారిటీలో ఏజీఎంగా విధులు నిర్వహించారు. అలాగే 2014-19 సంవ త్సరంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా ఉన్నారు.