Share News

Weather News: ముంచుకొస్తున్న మరో తుపాను.. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 08:14 PM

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక ప్రకటన చేసింది. భారత వాతావరణ విభాగం (IMD) సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్రం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.

Weather News: ముంచుకొస్తున్న మరో తుపాను.. ఆ ప్రాంతంలో భారీ వర్షాలు
Rains In AP

అమరావతి: ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ ఇవాళ (ఆదివారం) కీలక ప్రకటన చేసింది. భారత వాతావరణ విభాగం (IMD) సూచనల ప్రకారం ఉత్తర అండమాన్ సముద్రం మీదుగా ఆవర్తనం కొనసాగుతోందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో తూర్పుమధ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న ఉత్తర అండమాన్ సముద్ర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 22న ఉదయం నాటికి వాయుగుండంగా మారి.. 23 అక్టోబర్ నాటికి తూర్పు మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ తుపాను వాయవ్య దిశగా పయనించి అక్టోబర్ 24 ఉదయం నాటికి ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంకి చేరుకునే అవకాశం ఉందని తెలిపింది.


దీని ప్రభావంతో అక్టోబర్ 24, 25 ఉత్తరాంధ్రలో విస్తృతంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అప్రమత్తం చేసింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అక్టోబర్ 23, 24న పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో గంటకు 45-65 కిమీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అప్రమత్తం చేసింది. సముద్రం అలజడిగా ఉంటుందని, అక్టోబర్ 24 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని సూచన చేసింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగిరావాలని అప్రమత్తం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా సూచించింది. ఈ మేరకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ ఒక ప్రకటన విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి

బద్వేల్ ఘటనలో నిందితుడిని మీడియా ముందుకు తీసుకొచ్చి కడప ఎస్పీ

గుడ్ న్యూస్.. ఎన్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు ఫ్రీ కోచింగ్

For more AP News and Telugu News

Updated Date - Oct 20 , 2024 | 08:35 PM