Share News

మా చదువులు సాగట్లే..

ABN , Publish Date - Dec 22 , 2024 | 12:34 AM

గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక తమ చదువులు ముందుకు సాగడం లేదని, సిలబస్‌ పూర్తవ్వడం లేదని గిరిజన విద్యార్థులు రోడ్డెక్కారు. మల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న 54 మంది గిరిజన విద్యార్థులు శనివారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు.

 మా చదువులు సాగట్లే..
నిరసన వ్యక్తం చేస్తున్న మల్లి గురుకుల పాఠశాల విద్యార్థులు

ఐటీడీఏ ఎదుట నినాదాలు

సీతంపేట రూరల్‌, డిసెంబరు 21: గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేక తమ చదువులు ముందుకు సాగడం లేదని, సిలబస్‌ పూర్తవ్వడం లేదని గిరిజన విద్యార్థులు రోడ్డెక్కారు. మల్లి గురుకుల పాఠశాలలో చదువుతున్న 54 మంది గిరిజన విద్యార్థులు శనివారం సీతంపేట ఐటీడీఏ కార్యాలయానికి చేరుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. తమ పాఠశాలలకు ఉపాధ్యాయులు కావాలని అడవితల్లి విగ్రహం వద్ద నినదించారు.అనంతరం డీడీ కార్యాలయం ఎదుట కూడా నిరసన తెలిపారు. దీంతో ఏఎంవో కోటిబాబు, సూపరింటెండెంట్‌ దేశ్‌లు విద్యార్థుల వద్దకు వెళ్లి వారికి సర్దిచెప్పారు. దీంతో వారు అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇదిలా ఉండగా గురుకుల అవుట్‌ సోర్సింగ్‌ ఉపాధ్యాయులు చేపట్టిన దీక్ష శనివారం 32వ రోజుకు చేరింది. సీఆర్‌టీలతో సమానంగా వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఉపాధ్యాయులు బి.గణేష్‌, మోహనరావు, భవానీ,భాగ్యలక్ష్మిలు డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 22 , 2024 | 12:34 AM