Share News

తాగునీటి కలుషితంపై ఆరా

ABN , Publish Date - Oct 23 , 2024 | 12:08 AM

డయేరియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్‌, జిల్లా కలెక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌తో కలిసి మంగళవారం గుర్ల గ్రామంలో పర్యటించారు.

తాగునీటి కలుషితంపై ఆరా

గుర్ల, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): డయేరియా వ్యాధి ప్రబలడానికి గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్‌, జిల్లా కలెక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌తో కలిసి మంగళవారం గుర్ల గ్రామంలో పర్యటించారు. గ్రామంలో పారిశుధ్యాన్ని, తాగునీటి పైపు లైన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. తాగునీటి కలుషితంపై ఆరా తీశారు. నీటి సరఫరా గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న పారిశుధ్య కార్యక్రమాన్ని డీపీవో వెంకటేశ్వరరావు వివరించారు. అంతకుముందు నెలిమర్ల మండ లం ఎస్‌ఎస్‌ఆర్‌.పేట తాగునీటి పథకాన్ని ఆయన సందర్శించారు. గుర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. డయేరియాకు చికిత్స పొందుతున్న రోగులతో మాట్లా డి వైద్యంపై ఆరా తీశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ఎస్‌.భాస్కరరావు, ఇతర వైద్యులతో మాట్లాడారు. ఏపీ ఈపీడీఎస్‌ సీఎండీ పృద్వీతేజ, జేసీ సేతుమాధ వన్‌, ఆర్డీవో బి.సత్యవాణి, తహసీల్దార్‌ ఆదిలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

విజయనగరం కలెక్టరేట్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి కె. విజయానంద్‌ మంగళవారం జిల్లాకు వచ్చారు. ముందుగా కలెక్టర్‌ కార్యాలయంలోని కలెక్టర్‌ అంబేడ్కర్‌, జేసీ సేతుమాధవన్‌తో పాటు పలు శాఖల అధికారులతో మాట్లాడా రు. తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలు, ఆయా గ్రామంలోని పారిశుధ్యం పరిస్థితులు, డయేరియా బాఽధితులకు అందించిన వైద్య సహాయం తదితర ఆంశాలపై సమగ్రంగా సమాచారం సేకరించారు. గ్రామంలోని తాగునీరు కలుషితం కావడానికి గల కారణాలపై కూడా ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ ఆరా తీశారు. తాగు నీరు పరీక్షలు అనంతరం వచ్చిన ల్యాబ్‌ రిపోర్డుల ఫలితాలుపై ఆరా తీశారు. గ్రామం లోని బహిరంగ మలవిసర్జన జరుగుతున్నట్లు తెలిసిందని, గ్రామంలోని వ్యక్తిగత మరు గుదొడ్డులు లేనికుటుంబాలు ఎన్ని ఉన్నాయనే అనేదానిపై ఆడిగి తెలుసుకున్నారు. వాటి వివరాలను డీపీవో వెంకటేశ్వరరావు వివరించారు.

Updated Date - Oct 23 , 2024 | 12:08 AM