cmrf: పేదలకు సీఎంఆర్‌ఎఫ్ కింద సాయం: కోళ్ల
ABN , Publish Date - Dec 29 , 2024 | 11:40 PM
cmrf: పేదలకు వైద్య సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సా యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు.
లక్కవరపుకోట, డిసెంబరు29(ఆంధ్ర జ్యోతి): పేదలకు వైద్య సాయం కోసం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా సా యం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఆదివారం ఎల్.కోటలో జరిగినకార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 14మందికి మంజూరైన రూ.18 లక్షల 81 వేల 201 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో శ్రీనాథు పెదబాబు, కొల్లు రమణమూర్తి, కళ్లద్దాల శ్రీను, కోళ్ల శ్రీను, గొరపల్లి రాము పాల్గొన్నారు.