ఆర్టీసీలో పార్శిల్ సేవలు ఉపయోగించుకోండి
ABN , Publish Date - Feb 12 , 2024 | 12:10 AM
కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి వ్యాపారులు తమ పార్శిల్స్‌ను బుక్ చేసి పంపించుకోవచ్చునని ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.అప్పలనాయుడు తెలిపారు.
కొత్తవలస: కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సు నుంచి వ్యాపారులు తమ పార్శిల్స్‌ను బుక్ చేసి పంపించుకోవచ్చునని ఏపీఎస్ ఆర్టీసీ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ఆదివారం ఆయన కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సును సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులు, వ్యాపార సంస్థలు వారికి సంబంధించిన పార్శిల్స్‌ను బుక్ చేసుకోవడానికి, బుక్ చేసుకుని వచ్చిన పార్శిల్స్ భద్రపర్చుకునేందుకు అవసరమైన గదులు కొత్తవలస ఆర్టీసీ కాంప్లెక్సులో ఏర్పాటు చేశామని చెప్పారు. కార్గో సెక్షన్, బస్సుల అత్యవసర తలుపులను పరిశీలించారు. ప్రయాణీకులు, వ్యాపార సంస్థలు కొత్తవలసలో ఏర్పాటు చేసిన పార్శిల్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నర్శీ పట్టణం డిపో మేనేజర్ ధీరజ్ పాల్గొన్నారు.