Share News

ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి

ABN , Publish Date - Nov 24 , 2024 | 12:12 AM

ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, డిప్యూటీ కలెక్టర్‌ నూకరాజు సూచించారు. శనివారం భోగాపురంలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ ఎం.సురేష్‌, ఆర్‌ఐ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

ఓటరు నమోదుపై అవగాహన కల్పించాలి
భోగాపురం: ఓటరునమోదుకు వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తున్న నూకరాజు:

భోగాపురం, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): ఓటరు నమోదుపై యువతకు అవగాహన కల్పించాలని నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి, డిప్యూటీ కలెక్టర్‌ నూకరాజు సూచించారు. శనివారం భోగాపురంలో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు. కార్యక్ర మంలో తహసీల్దార్‌ ఎం.సురేష్‌, ఆర్‌ఐ ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

ఫ వంగర నవంబరు 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు గ్రామాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహించను న్నట్లు తహసీల్దార్‌ గోవిం దరావు తెలిపారు. శనివారం వంగర, సీతారాం పురంతోపాటు పలుగ్రామాల్లోని ఓటరు నమోదు కేంద్రాలను పరిశీలించారు.

ఫవిజయనగరం రూరల్‌, నవంబరు 23: (ఆంధ్రజ్యోతి): విజయనగరంలోని వుడా కాలనీలో గల 224, 228, 232 పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమా న్ని ఆర్డీవో దాట్ల కీర్తి శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల డీటీ బి.సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఫ నెల్లిమర్ల, నవంబరు 23: (ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల, జరజాపుపేట, మొయిద విజయరాంపురంల్లో తహసీల్దార్‌ సుదర్శనరావు ఓటర్ల నమోదుకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమం ఎన్నికల విభాగం డీటీ వీవీఆర్‌ జగన్నాఽథరావు, హెచ్‌డీటీ రవిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 24 , 2024 | 12:12 AM