గిరిజన చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
ABN , Publish Date - Nov 15 , 2024 | 12:30 AM
గిరిజ నుల కోసం రూపొందించిన చట్టాలు, హక్కులపై ప్రతిఒక్క రూ అవగాహన పెంచుకోవాలని సీఐడీ ఏఎస్పీ దిలీప్‌కిరణ్ అన్నారు.
సీతంపేట రూరల్, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): గిరిజ నుల కోసం రూపొందించిన చట్టాలు, హక్కులపై ప్రతిఒక్క రూ అవగాహన పెంచుకోవాలని సీఐడీ ఏఎస్పీ దిలీప్‌కిరణ్ అన్నారు. గురువారం స్థానిక ఐటీడీఏ కార్యాలయంలోని ఎస్ ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో సీఐడీ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ తెగల అత్యాచార నిరోధక చట్టం(పీవోఏ)పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమా నికి ప్రత్యేక ఆహ్వానితులుగా ఆయన హాజరయ్యారు. దీనికి ముందు ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో సి.యశ్వంత్‌కుమార్‌రెడ్డి తో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలను రక్షించేందుకు రాజ్యాంగంలో ప్రత్యేక చట్టాలు ఉన్నాయన్నారు. ఈ చట్టాలు తెలిసి తప్పు చేసినా, తెలియ క తప్పు చేసినా పీవోఏ చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారని తెలిపారు. అనంతరం వర్క్‌షాప్‌లో అవగాహన కల్పించిన అంశాలపై విద్యార్థులకు పరీక్ష నిర్వహించి బహు మతులు అందజేశారు. ఈ వర్క్‌షాప్‌లో విశా ఖపట్నం సీఐడీ డిఎస్పీ ఎంఎన్ భూపాల్, పాల కొండ డిఎస్పీ రాంబాబు, శ్రీకాకుళం జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.రఘురాం, తహసీల్దార్ అప్పలరాజు, ఏటీ డబ్ల్యూవో మంగవేణి, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రభాకరరా వు, ఏజేఏసీ అధ్యక్షుడు బిడ్డిక శ్రీనివాసరావు, సీఐడీ ఇన్‌స్పె క్టర్ బి.చలపతిరావు, జేఏసీ నాయకుడు బి.ఉమా మహేశ్వర రావు, ఎస్‌ఐ అమ్మన్నరావు, సీఐడీ సిబ్బంది ఎన్.వేణుగోపా లరావు, సీహెచ్ రుద్రశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు.