గ్లోబల్ టైగర్స్‌డేలో బేబీనాయన
ABN , Publish Date - Jul 30 , 2024 | 12:15 AM
గ్లోబల్ డే సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరి అరణ్యభవన్‌లో డిప్యూటీ సీఎం, అటవీశాఖామాత్యులు పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన)కు ప్రత్యేక గుర్తింపు లభించింది.
బొబ్బిలి, జూలై 29: గ్లోబల్ డే సందర్భాన్ని పురస్కరించుకుని మంగళగిరి అరణ్యభవన్‌లో డిప్యూటీ సీఎం, అటవీశాఖామాత్యులు పవన్‌కల్యాణ్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్‌వీఎస్‌కేకే రంగారావు(బేబీనాయన)కు ప్రత్యేక గుర్తింపు లభించింది. వన్యప్రాణుల ప్రేమికుడైన బేబీనాయనను గ్లోబల్ టైగర్స్‌డే కార్యక్రమంలో పాల్గొనాలని పవన్‌కల్యాణ్ స్వయంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బేబీనాయన స్వయంగా వన్యప్రాణులకు తీసిన ఫోటోలతో అక్కడ ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. దీనిని పవన్‌కల్యాణ్ ఆసక్తిగా తిలకించారు. బాంధవగడ్, తడోబా, కన్హా జాతీయ పార్కులకు ఏటా వెళ్లి అక్కడ వన్యప్రాణుల ఫొటోలను సజీవంగా కెమేరాలో బంధించిన తీరును బేబీనాయన వివరించారు. అటవీ విస్తీర్ణం పెంచాలని పెద్దపులుల ఆహారిత జీవులైన దుప్పుకణుతులు, అడవిపందులు తదితర జంతువుల సంఖ్యను పెంచేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు బేబీనాయన తెలిపారు. దేశవిదే శాల నుంచి పర్యాటకులను ఆకట్టుకునేందుకు అవసరమైన వైల్డ్‌లైఫ్ టూరిజమ్ పథకాలను అమలు చేయాల న్న తన సూచనకు పవన్‌కల్యాణ్ స్పందించడంపై బేబీనాయన హర్షం వ్యక్తం చేశారు.