తాటిపూడిలో బోటింగ్
ABN , Publish Date - Nov 18 , 2024 | 11:46 PM
తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం అనుమతించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృషితో జలవనరుల శాఖ అనుమతులు జారీ చేసింది.
తాటిపూడిలో బోటింగ్
గంట్యాడ, నవంబరు18(ఆంధ్రజ్యోతి): తాటిపూడి రిజర్వాయర్‌లో బోటింగ్ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం అనుమతించింది. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కృషితో జలవనరుల శాఖ అనుమతులు జారీ చేసింది. 2018లో కృష్టా నదిలో జరిగిన ప్రమాద ఘటనతో తాటిపూడిలో బోటు షికారు నిలిపివేశారు. అప్పటి నుంచి ఇక్కడకు ఎంతో ఆశతో వచ్చిన పర్యాటకులు నిరాశ చెందుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వం దీనిపై కనీసం దృష్టి పెట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చొరవ తీసుకున్నారు. రాష్ట్ర జలవనరులు, పర్యాటక శాఖ అధికారులతో పలుమార్లు సంప్రదించి బోటింగ్ అనుమతి సాధించారు. బోటింగ్ కార్యకలాపాల కోసం అవసరమైన మౌలిక వసతుల కల్పన పనులు మరోవారం రోజుల్లో ప్రారంభం కానున్నాయి. జెట్టీ నిర్మాణ పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆ వెంటనే బోటింగ్ ప్రారంభం కానుంది. ఏదైనాగాని ఇన్నాళ్లకు తాటిపూడికి పూర్వవైభవం రానుంది.