Share News

కిడ్నాప్‌ ఘటనలో ఫైనాన్స్‌ సిబ్బందిపై కేసు

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:27 AM

మండలంలోని అరిగిపాలెం గ్రామానికి చెందిన కాపుగంటి కార్తికేయ (17) కిడ్నాప్‌ ఉదంతంపై ఎస్‌.కోటకు చెందిన ఎస్‌ఎంఎఫ్‌జీ పైనాన్స్‌ కంపెనీ సి బ్బందిపై కేసు నమోదు చేసినట్టు వల్లంపూడి ఎస్‌ఐ రాజేష్‌ గురువారం తెలిపారు.

కిడ్నాప్‌ ఘటనలో ఫైనాన్స్‌ సిబ్బందిపై కేసు

వేపాడ: మండలంలోని అరిగిపాలెం గ్రామానికి చెందిన కాపుగంటి కార్తికేయ (17) కిడ్నాప్‌ ఉదంతంపై ఎస్‌.కోటకు చెందిన ఎస్‌ఎంఎఫ్‌జీ పైనాన్స్‌ కంపెనీ సి బ్బందిపై కేసు నమోదు చేసినట్టు వల్లంపూడి ఎస్‌ఐ రాజేష్‌ గురువారం తెలిపారు. ఇందుకు సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. కార్తికేయను కిడ్నాప్‌ చేసిన కోలా రామకృష్ణ, కనిశెట్టి శివపై కేసు నమోదు చేయడం తో పాటు వీరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసును ఎస్‌.కోట సీఐ ఉపేంద్ర పర్యవేక్షి స్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Aug 02 , 2024 | 12:27 AM