Share News

నీటి తీరువా వసూలు చేయండి

ABN , Publish Date - Oct 11 , 2024 | 12:22 AM

జిల్లాలో నీటి తీరువా బకాయిలు సుమారు రూ.14 కోట్లు ఉందని, నెలాఖరులోగా పూర్తిగా వసూలు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాలు, సాగునీటి సంఘాల ఎన్నికలు, నీటి తీరువా వసూళ్లు తదితర అంశాలపై కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు.

నీటి తీరువా వసూలు చేయండి
మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

నీటి తీరువా వసూలు చేయండి

బకాయిలు రూ.14 కోట్లు

నవంబరు ఒకటి నుంచి జమాబందీ నిర్వహించండి

కలెక్టర్‌ అంబేడ్కర్‌

కలెక్టరేట్‌, అక్టోబరు 10: జిల్లాలో నీటి తీరువా బకాయిలు సుమారు రూ.14 కోట్లు ఉందని, నెలాఖరులోగా పూర్తిగా వసూలు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్‌ అంబేడ్కర్‌ ఆదేశించారు. అమ్మవారి పండగ, విజయనగరం ఉత్సవాలు, సాగునీటి సంఘాల ఎన్నికలు, నీటి తీరువా వసూళ్లు తదితర అంశాలపై కలెక్టరేట్‌లో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాగునీటి సంఘాల ఎన్నికల ప్రక్రియ ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పక్కాగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ ప్రక్రియలో భాగస్వాములైన 13 మంది తహసీల్దార్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేషన్‌ డీలర్లు, రేషనలైజేషన్‌, ఖాళీల భర్తీ ప్రక్రియలను ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పూర్తి చేయాలన్నారు. అంతకుముందు జేసీ సేతుమాధవన్‌ మాట్లాడుతూ తహసీల్దార్లు జాబ్‌ చార్ట్‌ను విధిగా పాటించాలని సూచించారు. 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండివారంతా ఓటు హక్కు పొందేలా ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ నిర్వహించాలన్నారు. ఇసుక కొరత లేకుండా ఈనెల 15 నుంచి కొత్తగా రెండు రీచ్‌లో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో అనిత, ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్లు పాల్గొన్నారు.

Updated Date - Oct 11 , 2024 | 12:22 AM