Share News

చి‘వరి’ ప్రయత్నం

ABN , Publish Date - Nov 16 , 2024 | 11:51 PM

లక్కవరపుకోట మండల పరిధిలోని కళ్లేపల్లి, రేగ, నర్సంపేట, గంగుబూడి. శ్రీరాంపురం, తామరాపల్లి, కోనమసివానిపాలెం, నీలకంఠాపురం, లచ్చింపేట గ్రామాలకు సక్రమంగా వర్షాలు పడలేదు. చెరువుల గుంతలు, నేలబావుల నుంచి ఇంజన్‌ ఆయిల్‌తో నీరు తోడి వరి నాట్లు వేశారు.

 చి‘వరి’ ప్రయత్నం

చి‘వరి’ ప్రయత్నం

పంటను కాపాడుకునేందుకు అన్నదాతల పాట్లు

లక్కవరపుకోట మండల పరిధిలోని కళ్లేపల్లి, రేగ, నర్సంపేట, గంగుబూడి. శ్రీరాంపురం, తామరాపల్లి, కోనమసివానిపాలెం, నీలకంఠాపురం, లచ్చింపేట గ్రామాలకు సక్రమంగా వర్షాలు పడలేదు. చెరువుల గుంతలు, నేలబావుల నుంచి ఇంజన్‌ ఆయిల్‌తో నీరు తోడి వరి నాట్లు వేశారు. నేడు ఆ పొలాల్లో పూర్తిగా తడి ఆరిపోయింది. పంటంతా ఎండిపోతోంది. కాపాడుకొనేందుకు అయిల్‌ ఇంజన్‌లే గతయ్యాయి. వారం రోజులుగా ఈ గ్రామాల వరి పొలాల్లో ఎక్కడ చూసినా ఆయిల్‌ ఇంజన్‌లే కనిపిస్తున్నాయి. ఆఖరి తడి అందించి పంటను కాపాడుకొనేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

- శృంగవరపుకోట, నవంబరు 16(ఆంధ్రజ్యోతి):

Updated Date - Nov 16 , 2024 | 11:51 PM