Christmas క్రిస్మస్ జోష్
ABN , Publish Date - Dec 26 , 2024 | 12:26 AM
Christmas Josh జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు గీతాలను ఆలపించారు.
చర్చిల్లో క్రైస్తవుల ప్రత్యేక ప్రార్థనలు
అంతటా సందడే సందడి
పార్వతీపురం, డిసెంబరు 25 (ఆంధ్రజ్యోతి): జిల్లావ్యాప్తంగా క్రైస్తవులు బుధవారం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఏసు గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా పాస్టర్లు క్రీస్తు జననం, సందేశాలను వివరించారు. బైబిల్ చదివి వినిపించారు. ఆరాధనలతో ఆశీస్సులు అందజేశారు. మరోవైపు వాడవాడలా క్రైస్తవులు కేకులను కట్ చేసి ఒకరికొకరు పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఇళ్ల వద్ద స్వీట్లు పంచిపెట్టి.. విందు భోజనాలు ఏర్పాటు చేశారు. వర్షం కురిసినప్పటికీ అంతటా సందడి వాతావరణం కనిపించింది. చిన్నారులు, యువత కేరింతలు కొట్టారు. శాంతాక్లాజ్ వేషధారులు అందరినీ ఆకట్టుకున్నారు. మొత్తంగా జిల్లాలో క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటాయి.