అంగన్‌వాడీల ఆందోళన
ABN , Publish Date - Nov 16 , 2024 | 11:41 PM
జిల్లాలో అంగన్‌వాడీలు కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. మినీ సెంటర్లను మొయిన్ సెంటర్లుగా మార్చాలని నినదిం చారు. శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున ధర్నా చేశారు.
బెలగాం, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో అంగన్‌వాడీలు కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని.. మినీ సెంటర్లను మొయిన్ సెంటర్లుగా మార్చాలని నినదిం చారు. శనివారం కలెక్టరేట్ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున ధర్నా చేశారు. సమ్మె కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని , మినీ వర్కర్లకు వేసవి సెలవులు, గ్రేడ్ 2 సూపర్ వైజ్ పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 300 కుటుంబాలకు ఒక మినీ సెంటర్ ఉండాల్సిగా 1500 కుటుంబాలకు ఒక సెంటర్ ఉందని , సుప్రీంకోర్టు తీర్పును సైతం అమలు చేయడం లేదని తెలిపారు. అనంతరం జేసీ శోభికకు వినతిపత్రం అందజేశారు. ఈ నిరసనలో అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ నాయకులు జ్యోతి, సరళ కుమారి, అలివేలు, సీఐటీయూ నాయకులు వై.మన్మథరావు, ఇందిరా, గౌరమ్మ, హిమప్రభ తదితరులు పాల్గొన్నారు.