Share News

క్రీడాకారులకు అభినందన

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:55 PM

జన జాతీయ గౌరవ దివస్‌-2024లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ ల్లో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందనలు తెలిపారు.

క్రీడాకారులకు అభినందన

పార్వతీపురం, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జన జాతీయ గౌరవ దివస్‌-2024లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడా పోటీ ల్లో గెలుపొందిన క్రీడాకారులకు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమశాఖ, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభినందనలు తెలిపారు. సోమవారం గిరి ప్రతిభ కార్యక్రమం ప్రారంభోత్సవానికి పార్వతీపురం విచ్చేసిన ఆమె క్రీడాకారులను అభినందించారు. జావలిన్‌ త్రోలో గోల్డ్‌మెడల్‌ సాధించిన శ్రీదరపు చందు, వాలీబా ల్‌లో రెండో స్థానంలో నిలిచిన టి.జస్విన్‌ గ్రూప్‌ నకు, వ్యాసరచన పోటీల్లో ఆర్‌.గౌరీశంకర్‌కు, పెయింటింగ్‌లో జి.దిలీప్‌, పి.లావణ్యలకు ఆమె అవార్డులు, ధ్రువీకరణ పత్రాలు అందిం చారు. అనంతరం పొగాకు దుష్ప్రభావంపై వైద్య ఆరోగ్యశాఖ రూపొందిం చిన పోస్టర్‌ను మంత్రి విడుదల చేశారు. కురుపాం ఎమ్మెల్యే, విప్‌ తోయక జగదీశ్వరి, పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజ యచంద్ర, కలెక్టర్‌ ఎ.శ్యామ్‌ప్రసా ద్‌, పార్వతీపురం ఐటీడీఏ పీవో అశుతోష్‌ శ్రీవాస్తవ, డీఈ వో ఎన్‌.తిరుపతినాయుడు, ఐటీడీఏ ఏపీవో ఏ.మురళీధర్‌, పీఈటీ ఎం.వాసుదేవరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:55 PM