Share News

అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి

ABN , Publish Date - Nov 30 , 2024 | 12:09 AM

గత వైసీపీ ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో చేసుకున్న ఒప్పందాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

 అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలి
మాట్లాడుతున్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విజయనగరం దాసన్నపేట, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్‌ అదానీతో చేసుకున్న ఒప్పందాలను కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఆనందగజపతి ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. కోట్ల రూపాయల అదానీ కుంభకోణం జరిగిందని ప్రజలు చర్చించుకుంటున్నా తనకేమీ తెలియదన్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. దీనిపై సమాచారం సేకరిస్తున్నామని బుకాయిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి మూలాలన్నీ రాష్ట్రం వైపు వేలెత్తి చూపిస్తున్న ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణం. చంద్రబాబు వద్ద ఆధారాలు లేకపోతే మేము అందిస్తాం. తొందరలోనే ఆయన్ను కలుస్తాం’. అని అన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నేతలు కామేశ్వరరావు, ఒమ్మి రమణ, బుగత అశోక్‌, ఆనందరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 30 , 2024 | 12:09 AM