దౌడు అదరహో
ABN , Publish Date - Mar 22 , 2024 | 12:09 AM
బానాది గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు.
వేపాడ: బానాది గ్రామంలో శ్రీఅభయాంజనేయ స్వామి తీర్థ మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఉద యం ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు పోటీలు ప్రజలను ఉర్రూతలూగించాయి. అనంతరం గ్రామ పెద్దల చేతులమీదుగా విజేతకుల నగదు బహుమతులు అందించారు. ఈ తీర్థంలో అధికసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
లక్కవరపుకోట: కొట్యాడ తలారి గ్రామంలో అచ్చయ్యమ్మ పేరంటాలు తీర్థ మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. తీర్థంలో భాగంగా నిర్వహించిన ఎడ్లబండ్ల పోటీలు ఆహుతులను ఆకట్టుకున్నాయి. మధ్యలో ఒక బండి అదుపు తప్పి జనంలోకి దూసుకొచ్చింది. ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో నిర్వాహ కులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.