ఒక్కరోజులోనే అధిక శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Oct 02 , 2024 | 12:19 AM
జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం మంగళవారం వేకువ జాము నుంచే చేపట్టినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు.
గజపతినగరం: జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పింఛను పంపిణీ కార్యక్రమం మంగళవారం వేకువ జాము నుంచే చేపట్టినట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మంగళవారం పురిటిపెంట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పోలంకి కృష్ణకుమారి, కాసర రాధ అనే వృద్ధురాలికి పింఛన్ల పంపిణీనికి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్హులకు పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం వారి నుంచి ఎకనాలెడ్జ్‌మెంట్ ను తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. జిల్లాలో అక్టోబర్‌కు సంబంధించి 2లక్షల 78వేల 240మంది పింఛనుదారులకు గాను మధ్యాహ్నం రెండు గంటలకే 2లక్షల 70వేల 130 మందికి అందజేసినట్టు తెలిపారు. ఒక్కరోజులోనే 97.09 శాతం పంపిణీ చేసినట్టు కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కిషోర్‌కుమార్, తహసీల్దార్ రత్నకుమార్ పాల్గొన్నారు.
బొండపల్లి: అంబటివలసలో ఎన్టీఆర్ భరోసా పింఛను మొత్తం పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ మంగళవారం పరిశీలించారు. పింఛ4నులు సక్రమంగా పంపిణీ చేయాలని, ఎవరికీ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆయన ఆదేశించారు. సాంకేతిక లోపాలు తలెత్తకుండా జాగ్రత్తతలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.