Share News

విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - Dec 20 , 2024 | 12:23 AM

ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యాభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

విద్యాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం

కురుపాం, డిసెంబరు 19: ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించి, విద్యాభివృద్ధి చేయడమే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. కురుపాం జడ్పీ ఉన్నత పాఠశాలలో రూ.50.91లక్షల ఆర్‌ఎంఎస్‌ఏ నిధులతో నిర్మించిన అదనపు భవనాలను ఆమె గురువారం ప్రారంభించారు. ఈసందర్భం గా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అనంతరం ఆమెను ఉపాధ్యాయులు, స్థానిక టీడీపీ నాయకులు సన్మా నించారు. అలాగే రెండు నెలలో భవన నిర్మాణానికి కష్టప డిన మాజీ ఎంపీపీ జీవీ రమణమూర్తిని ఎమ్మెల్యే సన్మానిం చారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో జె.ఉమా మహేశ్వరి, ఎస్‌ఎంసీ చైర్‌పర్సన్‌ ఎస్‌.సుధారాణి, తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్‌కుమార్‌, టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య, జనసేన నియోజ కవర్గం ఇన్‌చార్జి కడ్రక మల్లేష్‌, హెచ్‌ఎం టి.శంకరరావు తదితరులు పాల్గొన్నారు.

గ్రామాల అభివృద్ధికి పెద్ద పీట

జియ్యమ్మవలస, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి అన్నారు. పెదమేరంగి జంక్షన్‌ నుంచి చెరువు గట్టు మీదుగా వెంకటాపురం, బాసంగి గదబవలస గ్రామం వరకు 3.2 కిలో మీటర్లు బీటీ రోడ్డు వేసేందుకు ప్రభుత్వం రూ.2.60 కోట్లు మంజూరు చేసింది. ఈ రోడ్డుకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. ఆమె ఎంపీపీ బొంగు సురేష్‌ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వా హక కార్యదర్శి దత్తి లక్ష్మణరావు, కురుపాం నియోజకవర్గ జనసేన ఇన్‌చార్జి కడ్రక మల్లేశ్వరరావు, వారణాశి శివ, కొండాబత్తుల కుమార్‌, రాగల అప్పలకొండ, దాసరి రామా రావు, వెంపటాపు భారతి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2024 | 12:23 AM